స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ ఏడాది అల్ట్రా సిరీస్‌ల మధ్య పోటీ కాస్త గట్టిగానే ఉంది. ముఖ్యంగా కెమెరాల విషయంలో షావోమీ 15 అల్ట్రా, వివో X200 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది.
సెన్సార్
- ఫొటోల విషయం ప్రధాన పాత్ర సెన్సార్‌దే. సెన్సార్ పెద్దదైతే లో క్లారిటీగా ఫొటోలు వస్తాయి.
- షావోమీ 15 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X8 అల్ట్రాలో 1-ఇంచ్ సోనీ సెన్సార్ ఉంది. ఇది స్పష్టంగా ఫొటోలు తీస్తుంది.
- వివో X200 అల్ట్రాలో 1/1.14 ఇంచ్ సెన్సార్ ఉంది. కొంచెం చిన్నదైనా పనితీరు బాగుంటుంది.
- శాంసంగ్ S25 అల్ట్రాలో పెద్ద మార్పు లేదు, పాత మోడల్‌లాగే ఉంటుంది.
జూమ్
- దూరం నుంచి స్పష్టమైన ఫొటో కావాలంటే జూమ్ కీలకం.
- ఒప్పో ఫైండ్ X8 అల్ట్రాలో రెండు పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి.. అవి 3x, 6x జూమ్.
- వివో X200 అల్ట్రాలో కూడా మంచి జూమ్ సౌకర్యం ఉంది.
- శాంసంగ్ S25 అల్ట్రాలో జూమ్ బాగుంటుంది.
- షావోమీ 15 అల్ట్రాలో టెలిఫోటో లెన్స్ బలంగా ఉంటుంది కానీ ఒప్పోలా విభిన్న జూమ్ ఉండదు.
కెమెరా?
- పెద్ద సెన్సార్‌తో పాటు, బాగా పనిచేసే కెమెరా అవసరం.
- శాంసంగ్ S25 అల్ట్రాలో మంచి AI ఉంది. దాని వల్ల ఫొటోలు సరిగ్గా వస్తాయి.
- వివో Zeiss పార్ట్‌నర్‌తో సహజ రంగులతో ఫొటోలు తీస్తుంది.
- షావోమీతో ఫొటోలు బాగావస్తాయి.
- ఒప్పో Natural Color టోన్ ఇస్తుంది.
వీడియోలు
- ఒప్పో ఫైండ్ X8 అల్ట్రాలో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన వీడియో వస్తుంది.
- శాంసంగ్ S25 అల్ట్రాలో స్థిరంగా వీడియో తీయొచ్చు.
- వివో X200 అల్ట్రాలో సినిమా మోడ్, పోర్ట్రెయిట్ వీడియో ఉంటుంది.
- షావోమీ 15 అల్ట్రాలో high-resolution, slow-motion, HDR వీడియోల సౌకర్యం ఉంటుంది.
ఎవరికి ఏ ఫోన్ బెస్ట్?
- ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా: 1-ఇంచ్ సెన్సార్, జూమ్ లెన్స్‌తో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు బెస్ట్.
- వివో X200 అల్ట్రా: సహజ రంగులు, జూమ్ కావాలనుకునేవారికి బెస్ట్.
- శాంసంగ్ S25 అల్ట్రా: అన్ని అంశాల్లో సమానంగా కెమెరా ఫీచర్లు ఉండే ఫోన్ కావాలనుకునే వారికి బెస్ట్.
- షావోమీ 15 అల్ట్రా: పెద్ద సెన్సార్, ప్రొ కంట్రోల్‌తో కూడిన ఫొటోలు తీయొచ్చు.