Google Work
Who Work From Home : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా..పలు కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాలు కల్పించాయి. అందులో గూగుల్ (Google) కూడా ఒకటి. ప్రస్తుతం వైరస్ అదుపులో వస్తున్న క్రమంలో…షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి మారితే..మాత్రం వారి జీతంలో కోతలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read More : Telangana : దళితబంధు, మొత్తం 30 పథకాలు..పూర్తి వివరాలు
ఈ విషయాన్ని రాయిటర్స్ పేర్కొంది. ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంటి నుంచి పనిచేసే వారి జీతంలో సుమారు 10 నుంచి 20 శాతం కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయానికి దూరమై వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న వారికి 25 శాతం వేతనాలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగుల వేతనాలు 10 శాతం తగ్గించినట్లు తెలుస్తోంది. అల్ఫాబెట్, ఇంక్ గూగుల్ ఉద్యోగులు ఉంటున్న లోకేషన్ ఆధారంగా..జీతాలు నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల లోకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. వారికి చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎల్లప్పుడు వారి స్థానం ఆధారంగా…నిర్ణయించబడుతాయి. సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.
Read More : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్?