Apple Watch Save Life : ఆమెను ఆపిల్ వాచ్ ఆస్పత్రిలో చేర్చేవరకు.. హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతే తెలియదట!

ఆపిల్ వాచ్ ఆమె ప్రాణాలను కాపాడింది.. హార్ట్ ఎటాక్ వచ్చిన ఆమె గ్రహించలేకపోయింది. ఆపిల్ వాచ్ అలర్ట్ చేసి ఆస్పత్రికి పంపేవరకు తెలియలేదట.. ఆపిల్ వాచ్ ధరించనవారిలో హార్ట్ రేట్స్ అసాధారణ స్థితిలో ఉన్నప్పుడు అలర్ట్ చేస్తుంది.

Apple Watch Saves Life : ఆపిల్ వాచ్ ఆమె ప్రాణాలను కాపాడింది.. హార్ట్ ఎటాక్ వచ్చిన ఆమె గ్రహించలేకపోయింది. ఆపిల్ వాచ్ అలర్ట్ చేసి ఆస్పత్రికి పంపేవరకు తెలియలేదట.. ఆపిల్ వాచ్ ధరించనవారిలో హార్ట్ రేట్స్ అసాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా అలర్ట్ చేస్తుంది. WZZM 13 రిపోర్టు ప్రకారం.. మిచిగాన్ కు చెందిన Diane Feenstra అనే మహిళకు ఈ విషయం ఆస్పత్రిలో చేరేవరకు తెలియలేదట.. మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్ అందరూ థ్యాంక్స్ చెబుతున్నారు.

ఆపిల్ వాచ్ అలర్ట్ చేసిన వెంటనే తన భర్త సాయంతో ఫీన్ స్ట్రాను అప్పటికప్పుడే ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 22న ఆమె వ్యాయామం చేయగా.. గుండె నిమిషానికి 169 సార్లు కొట్టుకున్నట్టు ఆపిల్ వాచ్ రీడ్ చేసింది. అలాగే 12 అడుగుల వరకు ఆమె నడిచింది కూడా. ఆ సమయంలో ఒక్కసారిగా హార్ట్ రేట్ పెరిగినట్టు అలర్ట్ చేయడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాంతో డాక్టర్లు ఆమెకు EKG చేయగా.. హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వెల్లడించారు.

తనకు ఆ విషయమే తెలియదని అంటోంది.. హార్ట్ ఎటాక్ వచ్చినవారిలో మాదిరిగా తనలో లక్షణాలు లేవని తెలిపింది. చాలామందికి హార్ట్ ఎటాక్ వస్తే.. చాలా నొప్పిగా ఉంటుంది.. కానీ, మహిళలో మాత్రం లక్షణాలు మరోలా ఉన్నాయి. ఎడమ చేతిలో నొప్పిగా అనిపించి తర్వాత తగ్గిపోయిందని, ఎడమ కాలిపై కొంచెం ఉబ్బినట్టుగా ఉందని గుర్తించింది. భుజాల్లో నొప్పిగా ఉందని తెలిపింది.

EKG చేసిన తర్వాత ఆమెకు మరిన్ని టెస్టులు చేయించారు. ఆమెకు స్టంట్ వేయనున్నారు. ప్రతి ఉదయం సమయంలో తప్పనిసరిగా హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలని అంటున్నారు. కొన్నిసార్లు అధిక రక్తపోటు పెరిగి ఆకస్మాత్తు మరణాలు సంభవించే రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే 78 ఏళ్ల వృద్ధుడు ఆపిల్ వాచ్ ధరించడం ద్వారా తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు