Xiaomi 13 Pro Sale in India begins today _ Where to buy, price, offers and features
Xiaomi 13 Pro Sale in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమీ (Xiaomi) సరికొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సేల్ మార్చి 10న మొదలైంది. ఈ ప్రీమియం షావోమీ స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. గత వారమే లిమిటెడ్ సేల్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ఫోన్ సాధారణ సేల్ అధికారిక Xiaomi ఇండియా వెబ్‌సైట్, Amazon, Mi హోమ్స్, Mi రిటైల్ పార్టనర్‌ల ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10వేల విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు Xiaomi ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యం కూడా కలిగి ఉంది.
భారత్‌లో షావోమీ13 ప్రో ధర :
షావోమీ 13 Pro ఒకే 12GB RAM, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీని ధర రూ.79,999గా ఉంది. ఇప్పటివరకు భారత్‌లో అత్యంత ఖరీదైన Xiaomi ఫోన్‌గా నిలిచింది. iCICI బ్యాంక్ కార్డుతో కస్టమర్లు రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే.. Xiaomi 13 Pro ధర రూ.69,999కి అందుబాటులో ఉంటుంది.
Xiaomi లేదా Redmi కాని డివైజ్‌లపై కంపెనీ రూ. 8వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు Xiaomi లేదా Redmi ఫోన్‌ను కలిగి ఉంటే.. కంపెనీ డివైజ్ విలువపై రూ. 12వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. Xiaomi 13 ప్రో సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది.
Xiaomi 13 Pro Sale in India begins today
Xiaomi 13 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ :
షావోమీ 13 Pro 2021 Mi 11 Ultra మాదిరిగా కనిపించకపోవచ్చు. అయితే, ఈ ఫోన్ కెమెరా-సెంటర్డ్ కస్టమర్ల కోసం రూపొందించారు. షావోమీ 13ప్రో భారత మార్కెట్లో లైకా-ట్యూన్డ్ కెమెరాలను కలిగిన ఫస్ట్ Xiaomi ఫోన్ అని చెప్పవచ్చు. Xiaomi 13 ప్రో ముఖ్య ఫీచర్లలోమూడు 50-MP కెమెరాలు (వైడ్ + అల్ట్రా-వైడ్ + టెలిఫోటో), 32-MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6.7-అంగుళాల 2K కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డిస్ప్లే డాల్బీ విజన్, HDR10+కి కూడా సపోర్టు ఇస్తుంది.
ఇతర ప్రీమియం Xiaomi స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే.. Xiaomi 13 ప్రో కూడా 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. వినియోగదారులు ఇయర్‌బడ్‌లను రివర్స్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేయవచ్చు. Xiaomi 13 Pro పెద్ద 4,820mAh బ్యాటరీని అందిస్తుంది. Qualcomm ద్వారా Snapdragon 8 Gen 2 SoC నుంచి పవర్ అందిస్తుంది.
ఇతర ముఖ్య ఫీచర్లలో 5G (16 బ్యాండ్‌లు), అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 13-ఆధారిత MIUI 14 ఉన్నాయి. 50-MP టెలిఫోటో కెమెరాలో యూజర్లు అద్భుతమైన ఫొటోలను తీయడానికి ఫ్లోటింగ్ లెన్స్ మెకానిజం ఉంది. Xiaomi ఇండియా అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రోను భారతీయ వినియోగదారుల కోసం ఇప్పుడు భారీ తగ్గింపుతో అందిస్తోంది.