Xiaomi 13 Pro Launch : షావోమీ 13ప్రో ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు, మరెన్నో ఆఫర్లు, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్‌ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది.

Xiaomi 13 Pro Launch : షావోమీ 13ప్రో ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు, మరెన్నో ఆఫర్లు, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Xiaomi 13 Pro launched in India at Rs. 79,999_ Check offers, specs, more

Updated On : March 5, 2023 / 8:17 PM IST

Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్‌ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదట చైనాలో డిసెంబర్ 2022లో బేస్ Xiaomi 13తో పాటు లాంచ్ అయింది. ఈ డివైజ్ Qualcomm నుంచి Snapdragon 8 Gen 2 SoC ద్వారా పవర్ అందిస్తోంది. వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 4,820mAh బ్యాటరీని కలిగి ఉంది. Xiaomi భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను అధికారికంగా ప్రకటించింది.

షావోమీ 13 Pro ధర ఎంతంటే? :
Xiaomi 13 Pro ఫోన్ మోడల్ (12GB + 256GB స్టోరేజ్) వేరియంట్ భారత మార్కెట్లో ధర రూ. 79,999గా ఉంది. అయితే, Xiaomi రూ. 10వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Xiaomi 13 ప్రో ధర రూ.69,999కి తగ్గింది. మార్చి 10న భారత మార్కెట్లో Xiaomi 13 ప్రో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

Read Also : Best 5G Phones in India : ఈ మార్చిలో రూ.30వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!

ఈ స్మార్ట్‌ఫోన్‌ను Amazon, Mi.com, Mi Home, Mi స్టోర్లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. షావోమీ13 ప్రో మోడల్ మొదటి వెయ్యి మంది కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. మార్చి 6 నుంచి అడ్వాన్స్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రారంభ సేల్ ఆఫర్‌ను Mi.com, Mi Home, Mi స్టూడియోస్ ద్వారా పొందవచ్చు. షావోమీ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్‌లు ఇవే :
భారత్‌లో షావోమీ13 ప్రో వేరియంట్‌లో 6.73-అంగుళాల 2K OLED డిస్‌ప్లే ఉంది. డాల్బీ విజన్, HDR10+కి సపోర్టు అందిస్తుంది. డిస్‌ప్లే 240Hz టచ్ శాంప్లింగ్‌ను అందిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. MIUI 14పై రన్ అవుతుంది. Android 13పై ఆధారపడి పనిచేస్తుంది.

Xiaomi 13 Pro launched in India at Rs. 79,999_ Check offers, specs, more

Xiaomi 13 Pro launched in India at Rs. 79,999

ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మొదటి డివైజ్‌‌లలో ఒకటిగా నిలిచింది. షావోమీ (Xiaomi 13 Pro) Leicaతో భాగస్వామ్యం కుదర్చుకుంది. Leica 75mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్‌ను కలిగిన మొదటి డివైజ్ అని చెప్పవచ్చు. Xiaomi 13 Pro భారతీయ వేరియంట్ చైనీస్ కౌంటర్ మాదిరిగానే ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో వచ్చింది.

కెమెరా సిస్టమ్‌లో 50-MP 1-అంగుళాల సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, 50-MP ఫ్లోటింగ్ టెలిఫోటో సెన్సార్, 50-MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. డివైస్ డిస్‌ప్లే హోల్-పంచ్ కటౌట్‌లో 32-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. షావోమీ 13 Pro గరిష్టంగా 12GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.3, NFCకి సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్, IP68 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. Xiaomi ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,820mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Read Also : Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్‌తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్‌లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?