Xiaomi 14 Pro Launch Date : షావోమీ 14 ప్రో సిరీస్ లాంచ్ డేట్ లీక్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 14 Pro Launch Date : షావోమీ 14 ప్రో సిరీస్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియనప్పటికీ.. షావోమీ ఫోన్‌లు నవంబర్ 11 లోపు లాంచ్ కానున్నాయని భావిస్తున్నారు. Xiaomi 14, Xiaomi 14 ప్రో పుకార్ల లాంచ్ తేదీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi 14 and Xiaomi 14 Pro launch date leaked, here is all you need to know

Xiaomi 14 Pro Launch Date : 2023 ఏడాది ఫిబ్రవరిలో (Xiaomi 13 Pro) భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటివరకు భారత్‌లో అత్యంత ఖరీదైన షావోమీ ఫోన్.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ విమర్శకుల నుంచి అలాగే వినియోగదారుల నుంచి పాజిటివ్ రివ్యూలను పొందింది. ఇప్పుడు, షావోమీ (Xiaomi 14) సిరీస్ గ్లోబల్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్‌లో షావోమీ 14, షావోమీ 14 ప్రో అనే 2 మోడల్‌లు ఉంటాయి. అయితే, ఈ ఫోన్ల కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియనప్పటికీ.. నవంబర్ 11 లోపు లాంచ్ కానున్నాయని భావిస్తున్నారు. Xiaomi 14, Xiaomi 14 ప్రో పుకార్ల లాంచ్ తేదీ గురించి మరింత తెలుసుకుందాం..

షావోమీ 14, షావోమీ 14 ప్రో లాంచ్ తేదీ (అంచనా) :
అక్టోబర్ 24న స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను ఆవిష్కరించిన వెంటనే షావోమీ 14 సిరీస్ ఈ ఏడాది చివరిలో రావచ్చునని (xiaomiui) నివేదిక తెలిపింది. నవంబర్ 11 లోపు ఫోన్ రావచ్చని నివేదిక తెలిపింది. చైనాలో ముఖ్యమైన తేదీ.. ఎందుకంటే, డబుల్ ఎలెవెన్ సేల్స్ ఈవెంట్ జరుగుతుంది. తెలియని వారికి, నవంబర్ 11ని చైనాలో సింగిల్స్ డే అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ షాపింగ్ సీజన్, షావోమీ ఈ పాపులర్ షాపింగ్ సీజన్‌ను సద్వినియోగం చేసుకోనుంది.

Read Also : Jio AirFiber Launch : ‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌.. ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్‌కు తేడా ఏంటి? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

షావోమీ 14, షావోమీ 14 ప్రో స్పెక్స్ ధర (అంచనా) :
షావోమీ 14 మోడల్ 6.4-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని నివేదించింది. అయితే, షావోమీ 14 ప్రో పెద్ద, 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండు ఫోన్‌లు 522ppiతో పాటు 1440×3200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్, పంచ్-హోల్ నాచ్ డిజైన్‌తో కూడా వస్తాయి. షావోమీ Android 14 ఆధారంగా MIUI 15ని టెస్టింగ్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి అదనంగా, రెండు ఫోన్‌లు ఇంకా లాంచ్ కానుందని Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు.

Xiaomi 14 and Xiaomi 14 Pro launch date leaked, here is all you need to know

రెండు ఫోన్‌లు కూడా ఒక వేరియంట్‌ను కలిగి ఉన్నాయి. 12GB RAM, 256GB స్టోరేజ్ స్పేస్‌తో అందుబాటులో ఉంటుందని రుమర్లు వినిపిస్తున్నాయి. షావోమీ డివైజ్‌ల కోసం 128GB వేరియంట్‌ను లాంచ్ చేయకపోవచ్చు. షావోమీ 14 గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. 4860mAh బ్యాటరీని కలిగి ఉందని, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చు. OISతో మూడు 50MP బ్యాక్ కెమెరాలతో ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు.

ఈ ఫోన్ ధర రూ.54,999గా ఉండవచ్చని అంచనా. షావోమీ 14 Pro విషయానికి వస్తే.. ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రావచ్చు. ఐఫోన్ 15 ప్రోలో ఉపయోగించిన అదే మెటీరియల్, ఈ ఫోన్ బాడీలో టైటానియం బిల్డ్ ఉండవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. షావోమీ ఫోన్ ధర రూ.64,990గా ఉండవచ్చని అంచనా. అయితే, ప్రస్తుతానికి అవన్నీ పుకార్లు మాత్రమేనని గమనించాలి. షావోమీ 14 ప్రో సిరీస్ డివైజ్ కచ్చితమైన లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలియాలంటే Xiaomi అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

Read Also : WhatsApp Chat Ads : వద్దు బాబోయ్‌.. వాట్సాప్ చాట్‌లో యాడ్స్ కనిపిస్తాయా? యూజర్ల ప్రైవసీకి భద్రత లేనట్టేనా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

ట్రెండింగ్ వార్తలు