WhatsApp Chat Ads : వద్దు బాబోయ్‌.. వాట్సాప్ చాట్‌లో యాడ్స్ కనిపిస్తాయా? యూజర్ల ప్రైవసీకి భద్రత లేనట్టేనా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

WhatsApp Chat Ads : ఫేస్‌బుక్ (Meta) వాట్సాప్ (WhatsApp)ని కొనుగోలు చేసిన సమయంలో వాట్సాప్ చాట్‌లో ఎప్పటికీ యాడ్స్ ఉండవని స్పష్టం చేసింది. కానీ, ఇప్పుడు కంపెనీ వాట్సాప్ చాట్‌లలో యాడ్స్ ప్రవేశపెట్టనుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ నివేదికను వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ కొట్టిపారేశారు.

WhatsApp Chat Ads : వద్దు బాబోయ్‌.. వాట్సాప్ చాట్‌లో యాడ్స్ కనిపిస్తాయా? యూజర్ల ప్రైవసీకి భద్రత లేనట్టేనా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

Report says WhatsApp may show ads in chats, WhatsApp denies

WhatsApp Chat Ads : 2014లో మెటా (ఫేస్‌బుక్) వాట్సాప్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇదే ప్రశ్న తలెత్తుతోంది. యూజర్ డేటాను మానిటైజ్ చేయడంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంత దూకుడుగా ఉన్నాయో చూస్తే.. త్వరలో వాట్సాప్‌కు కూడా యాడ్స్ వస్తాయనే భయాందోళన నెలకొంది. అయితే వాట్సాప్ (Whatsapp), ఫేస్‌బుక్ (Meta) తమ డీల్ ముగించినప్పటికీ, వాట్సాప్‌లో ఎప్పటికీ యాడ్స్ ఉండవని చాట్ డేటా లేదా యూజర్ల ట్రాకింగ్, మానిటైజేషన్ కోసం ఉపయోగించేది లేదని రెండు కంపెనీల యాజమాన్యం కచ్చితంగా తేల్చిచెప్పింది.

దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి మారుతుందని ఒక నివేదిక చెబుతోంది. వాట్సాప్, మెటా బృందంతో జరిగిన చర్చను నివేదిక వెల్లడించింది. వాట్సాప్ చాట్‌లలో యాడ్స్ డిస్‌ప్లే చేయడం ద్వారా డబ్బు ఆర్జించడంపై ఇరు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.

Read Also : OnePlus Nord 3 5G Sale : భారతీయ కస్టమర్లకు అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ కొంటే.. నార్డ్ బడ్స్ 2R ఇయర్‌ఫోన్స్ ఉచితం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

మెటా సబ్‌స్క్రిప్షన్‌పై ఛార్జీలు? :
నివేదిక చెప్పిందే నిజం అయితే.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లు గతంలో వినియోగదారులకు చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఈ నివేదికలను వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. వాట్సాప్ టీమ్‌ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ మాట్లాడుతూ.. ఇదంతా అబద్ధమని కొట్టిపారేశారు. అలాంటి చర్చలు ఏం జరగడం లేదని స్పష్టం చేశారు. అందులో బ్రియాన్ పేరును తప్పుగా రాసినట్లు కనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఆదాయాన్ని పెంచడానికి వాట్సాప్ చాట్ స్క్రీన్‌లకు యాడ్స్ అందించే అవకాశాన్ని మెటాలోని బృందాలు చర్చిస్తున్నాయని వార్తా నివేదిక గతంలో పేర్కొంది.

అయితే, ఇది వాట్సాప్ యూజర్లలో ఆందోళనలను పెంచుతుందా? యూజర్ల ప్రైవసీ భద్రతకు ముప్పు వాటిల్లుతుందా? అని మెటా ఉద్యోగులు చర్చించుకుంటున్నారట.. అయితే, దీనిపై మెటా ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అదనంగా, యాడ్-ఫ్రీ వాట్సాప్ ఎక్స్‌పీరియన్స్ కోసం మెటా సబ్‌స్క్రిప్షన్ రుసుమును ప్రవేశపెట్టడాన్ని కూడా పరిశీలిస్తోందని నివేదిక పేర్కొంది.

Report says WhatsApp may show ads in chats, WhatsApp denies

Report says WhatsApp may show ads in chats, WhatsApp denies

అయితే, చాలా మంది కంపెనీకి సంబంధించిన అధికారులు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాడ్స్ ఇంటిగ్రేషన్ లైవ్ అయితే.. Facebook మెసెంజర్‌లోని సంభాషణలు, జీమెయిల్(Gmail)లోని ఇమెయిల్‌ల మధ్య యాడ్స్ ఎలా కనిపిస్తాయో అదేవిధంగా వాట్సాప్ యాడ్స్ ఇంటర్‌ఫేస్ పోలి ఉంటుందని నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం వాట్సాప్ చాట్‌లలో యాడ్స్ కనిపించే అవకాశం లేనప్పటికీ.. 2014 నిబంధనల ప్రకారం.. వాట్సాప్ కొంత వెనక్కి తగ్గిందని, యూజర్ల ప్రైవసీపైనే దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఫేస్‌బుక్ ఫోన్ నంబర్‌లతో సహా మెటా డేటాను లింక్ చేయాలని నిర్ణయించింది. Facebook యూజర్లతో వాట్సాప్ యూజర్లకు యాడ్స్ అందించడానికి అనేక చిక్కులను కలిగి ఉండకపోవచ్చు.

మెటా, (Instagram)లో యాడ్స్ అందించడం కోసం ప్రొఫైల్ యూజర్ల డేటాను Facebook సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ చర్యతో భారత్‌లోని ప్రభుత్వ నియంత్రణ సంస్థల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లను ప్రవేశపెట్టింది. ఈ అకౌంట్ల ద్వారా నిర్వహించే చాట్‌లు, వ్యక్తిగత వాట్సాప్ యూజర్ల ప్రైవేట్ చాట్‌ల మాదిరిగా ప్రైవసీ భద్రతలను కలిగి ఉండవని కంపెనీ స్పష్టం చేస్తోంది.

Read Also : Jio AirFiber Launch : ‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌.. ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్‌కు తేడా ఏంటి? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?