Jio AirFiber Launch : ‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌.. ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్‌కు తేడా ఏంటి? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Jio AirFiber Launch : రిలయన్స్ జియో జియో ఎయిర్‌ఫైబర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. 1.5Gbps వరకు స్పీడ్ అందించే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్. సాంప్రదాయ JioFiber బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు జియో కొత్త AirFiber మధ్య తేడా ఉంటో ఇప్పుడు చూద్దాం.

Jio AirFiber Launch : ‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌.. ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్‌కు తేడా ఏంటి? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Jio AirFiber launching on September 19_ Price, specs and how it differs from current JioFiber connection

Jio AirFiber Launch : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) సెప్టెంబర్ 19, 2023న జియో ఎయిర్‌ఫైబర్ అనే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సర్వీసుతో గృహాలు, కార్యాలయాల కోసం రూపొందించిన పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్, గరిష్టంగా 1.5Gbps స్పీడ్ అందించనుంది. 2023 AGM సందర్భంగా, గణేష్ చతుర్థి రోజున (Jio AirFiber) అధికారికంగా అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

జియో ఎయిర్‌ఫైబర్ తల్లిదండ్రుల కంట్రోల్స్, Wi-Fi 6కి సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసును మొదటగా గత ఏడాదిలో కంపెనీ 45వ AGMలో ప్రవేశపెట్టింది. జియో ఎయిర్‌ఫైబర్, సాధారణ (JioFiber) ఇంటర్నెట్ కనెక్షన్‌కి ఎలా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? :
Jio AirFiber అనేది Jio నుంచి వచ్చిన కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసు.. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు 5G టెక్నాలజీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లతో అత్యధిక వేగాన్ని అందిస్తుంది. వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు.

Read Also : iPhone 15 Series Low Price : ఐఫోన్ 15 సిరీస్ కావాలా? తక్కువ ధరకే కొత్త ఐఫోన్లను అందిస్తున్న దేశాలివే.. ఏ దేశంలో ధర ఎంత? ఇప్పుడే తెప్పించుకోండి..!

జియో ఎయిర్‌ఫైబర్ (JioAirfiber) కాంపాక్ట్ మాత్రమే కాదు.. సెటప్ చేయడం కూడా సులభమని జియో పేర్కొంది. మీరు ప్లగ్ ఇన్ చేసి.. ఆన్ చేయండి. అంతే. మీ ఇంట్లో పర్సనల్ Wi-Fi హాట్‌స్పాట్‌ ఉంటే.. జియో True 5Gని ఉపయోగించి అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. (JioAirFiber) సర్వీసు సాయంతో మీ ఇల్లు లేదా ఆఫీసును గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్‌కు త్వరగా కనెక్ట్ చేసుకోవచ్చునని అని జియో పేర్కొంది.

Jio AirFiber vs JioFiber :
టెక్నాలజీ : జియో ఫైబర్ కవరేజీకి వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను ఉపయోగిస్తుంది. అయితే, Jio AirFiber పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్‌లెస్ విధానాన్ని తీసుకుంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, ఆఫీసులను నేరుగా జియోకి వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తుంది. ఫైబర్ కేబుల్స్‌కు బదులుగా జియో టవర్‌లతో లైన్-ఆఫ్-సైట్ కమ్యూనికేషన్‌పై ఆధారపడుతుంది.

Jio AirFiber launching on September 19_ Price, specs and how it differs from current JioFiber connection

Jio AirFiber launching on September 19_ Price, specs and how it differs from current JioFiber connection

స్పీడ్ (Speed) : జియో AirFiber గరిష్టంగా 1.5Gbps ఇంటర్నెట్ స్పీడ్ అందజేస్తుంది. జియో ఫైబర్ 1Gbps స్పీడ్ అధిగమిస్తుంది. అయితే, జియో ఎయిర్‌ఫైబర్ రియల్ స్పీడ్ సమీప టవర్‌కు దూరాన్ని బట్టి మారవచ్చనని గమనించాలి.

కవరేజ్ (Coverage) : జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. దీనికి విరుద్ధంగా, Jio ప్రకారం, JioAirFiber వైర్‌లెస్ సాంకేతికత భౌతిక మౌలిక సదుపాయాల ద్వారా పరిమితం కాకుండా విస్తృతమైన కవరేజీని అందించడానికి అనుమతిస్తుంది.

ఇన్‌స్టాలేషన్ (installation)  : Jio AirFiber ప్లగ్-అండ్-ప్లే చేసేందుకు రూపొందించింది. మరింత యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు, జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ అవసరం.

ధర (Price) : జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు పోటీ ధరతో అంచనా వేసింది. ఈ జియో ధర దాదాపు రూ. 6వేలు ఉంటుంది. JioAirFiber బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కన్నా కొంచెం ఖరీదైనది కావచ్చు. ఎందుకంటే.. ఇందులో పోర్టబుల్ డివైజ్ యూనిట్ ఉంటుంది.  Jio AirFiber కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ కన్నా ఎక్కువ అందిస్తుంది. పేరంట్ కంట్రోల్ టూల్స్, Wi-Fi 6కి సపోర్టు, Jio సెట్-టాప్ బాక్స్‌తో ఇంటిగ్రేషన్, నెట్‌వర్క్‌పై ఎక్కువ కంట్రోల్ కూడా కలిగి ఉంటుంది.

Read Also : OnePlus Nord 3 5G Sale : భారతీయ కస్టమర్లకు అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ కొంటే.. నార్డ్ బడ్స్ 2R ఇయర్‌ఫోన్స్ ఉచితం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!