Xiaomi 14 Civi (Image Credit To Original Source)
Xiaomi 14 Civi : షావోమీ కొత్త ఫోన్ కావాలా? ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఈ షావోమీ 14 సివి కొనేసుకోవచ్చు. స్పెషల్ డిజైన్, ఆకట్టుకునే డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కెమెరాలతో వస్తుంది.
అంతేకాదు.. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ షావోమీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, డ్యూయల్ 32MP సెల్ఫీ కెమెరాలతో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. షావోమీ 14 సివి ఆఫర్, ఇతర డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
షావోమీ 14 సివి అమెజాన్ డీల్ :
ఈ షావోమీ ఫోన్ రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.26,999కి లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.16వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాదు.. ఈ-కామర్స్ బ్రాండ్ స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 1500 వరకు 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు కేవలం రూ.949 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తుంటే.. ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 25,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
Xiaomi 14 Civi (Image Credit To Original Source)
షావోమీ 14 సివి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ షావోమీ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 4,700mAh బ్యాటరీతో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందుకుంటుంది. డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్ 68 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం షావోమీ 14 సివి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ రెండు 32MP కెమెరాలతో కూడా వస్తుంది.