LIC Jeevan Utsav : ఎల్ఐసీ పాలసీదారులకు పండగే.. కొత్త LIC జీవన్ ఉత్సవ్ స్కీమ్.. సింగిల్ ప్రీమియం.. జీవితాంతం బీమా..!
LIC Jeevan Utsav : 2026 ప్రారంభంలో కొత్త బీమా పథకాలతో ఎల్ఐసీ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎల్ఐసీలో సింగిల్ ప్రీమియం, పాత పాలసీ రెన్యువల్ క్యాంపెయిన్ పూర్తి వివరాలివే..
LIC Jeevan Utsav Plans (Image Credit To Original Source)
- ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ కొత్త సింగిల్ ప్రీమియం బీమా పథకం
- జనవరి 12, 2026 నుంచి అందుబాటులోకి
- జనవరి 1 నుంచి మార్చి 2, 2026 వరకు బీమా కవరేజీ రెన్యువల్ ఆప్షన్
- ఆలస్య రుసుము 30 శాతంతో గరిష్టంగా రూ. 5వేల వరకు రాయితీ
LIC Jeevan Utsav : ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్.. 2026 ప్రారంభంలో దేశీయ అతిపెద్ద బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC) తమ కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన పాలసీలను తీసుకొచ్చింది. అందులో ఒకటి జీవన్ ఉత్సవ్ పాలసీ కాగా, రెండోవది పాలసీలు గడువు ముగిసిన వారికి బెనిఫిట్స్ అందించనుంది. ఈ రెండింటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్ఐసీ కొత్త బీమా పాలసీ ఇదే :
ఎల్ఐసీ పాలసీదారుల కోసం ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ అనే కొత్త బీమా పాలసీని ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ జనవరి 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ కింద కస్టమర్లు ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత పాలసీ జీవితాంతం కవరేజీని అందిస్తుంది. ఈ సింగిల్ ప్రీమియం పాలసీ జనవరి 12 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఫీచర్లు :
ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ కొత్త పథకం మార్కెట్-లింక్డ్ కాదు. జీవితాంతం బీమా కవర్‌తో పాటు సేవింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
జీవితాంతం ఆదాయంతోపాటు బీమా రక్షణ కూడా ఉంటుంది. నెల వయసు పిల్లల దగ్గర నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు. ఇందులో గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి రూ. వెయ్యికి ఏడాదికి రూ. 40 చొప్పున డిపాజిట్ అవుతుంది. 7ఏళ్ల నుంచి 17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10శాతం ఆదాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఎల్ఐసీ దగ్గర అలాగే ఉంచితే 5.5శాతం చక్రవడ్డీ కూడా చెల్లిస్తుంది.
| మొత్తం ప్రీమియం | ఆలస్య రుసుము రాయితీ (%) | గరిష్ట రాయితీ |
|---|---|---|
| రూ. లక్ష వరకు | 30 శాతం | రూ. 3,000 |
| రూ. 1,00,001 నుంచి రూ. 3 లక్షల వరకు | 30 శాతం | రూ. 4,000 |
| రూ. 3,00,001 అంతకంటే ఎక్కువ | 30 శాతం | రూ. 5,000 |
| సూక్ష్మ బీమా పథకాలు | 100 శాతం | పూర్తి రాయితీ |
ఎల్ఐసీ రెన్యువల్ క్యాంపెయిన్ :
కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రీమియంలు చెల్లించక బీమా పాలసీలు నిలిచిపోయిన వారి కోసం ఎల్ఐసీ ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ఎల్ఐసీ రెన్యువల్ క్యాంపెయిన్ గా చెబుతోంది. ఈ క్యాంపెయిన్ జనవరి 1న ప్రారంభంగా కాగా మార్చి 2, 2026 వరకు కొనసాగుతుంది. కొన్ని నాన్-లింక్డ్ మైక్రో బీమా పాలసీలను రాయితీ రేటుతో రెన్యువల్ చేయించుకోవచ్చు. ఆలస్య రుసుములు కూడా మాఫీ అవుతాయి.

LIC Jeevan Utsav (Image Credit To Original Source)
అన్ని నాన్-లింక్డ్ బీమా ప్లాన్‌లకు ఎల్ఐసీ ఆలస్య రుసుములో రాయితీని కూడా అందిస్తోంది. ఈ పథకం కింద రెన్యువల్ అర్హత ఉంటే ఆలస్య రుసుములో 30శాతం వరకు గరిష్టంగా రూ. 5వేల వరకు రాయితీ ఉంటుంది. ఎల్ఐసీ ప్రకారం, మొదటి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ నుంచి 5 ఏళ్ల లోపు పాలసీలను రెన్యువల్ చేయొచ్చు. ప్రీమియం పేమెంట్ సమయంలో గడువు ముగిసిన ఇంకా పూర్తిగా చెల్లించని పాలసీలు ఈ క్యాంపెయిన్‌కు అర్హులు.
ఏ ఎల్ఐసీ పాలసీని రెన్యువల్ చేయొచ్చంటే? :
“పాలసీ నిబంధనలు, షరతులను నెరవేర్చినప్పటికీ ఫస్ట్ ప్రీమియం చెల్లించని తేదీ నుంచి 5 ఏళ్ల లోపు ఎప్పుడైనా పాలసీలను రెన్యువల్ చేయొచ్చు. ప్రీమియం పేమెంట్ వ్యవధిలో గడువు ముగిసినా పాలసీ వ్యవధి పూర్తి కాని పాలసీలు రెన్యువల్ చేయించేందుకు అర్హులు” అని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది.
వైద్య, ఆరోగ్య అవసరాలపై ఎలాంటి రాయితీలు ఉండవని ఎల్ఐసీ తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేని పాలసీదారుల కోసం ఈ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు ఎల్ఐసీ తెలిపింది.
