Xiaomi 14T Series Price : షావోమీ నుంచి సరికొత్త ఫోన్.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!
Xiaomi 14T Series Price Leak : షావోమీ 14టీ సిరీస్ రాబోతోంది. ఈ నెల 26న ఈ కొత్త టీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.

Xiaomi 14T Series Complete Specifications, Price Leaked Ahead of September 26 Launch
Xiaomi 14T Series Price Leak : షావోమీ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో షావోమీ 14టీ సిరీస్ రాబోతోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 26న ఈ కొత్త టీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. షావోమీ 14టీ సిరీస్ మోడల్ గత ఏడాది ఇదే తేదీన ఆవిష్కరించిన షావోమీ 13టీ లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్.
రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లలో మీడియా టెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లు, 144Hz అమోల్డ్ డిస్‌ప్లేలు, లైకాతో సహ-ఇంజనీరింగ్ చేసిన కెమెరా యూనిట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, ఐరోపాలో షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో ధర, కలర్ ఆప్షన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
షావోమీ 14టీ సిరీస్ ధర (లీక్) :
జర్మన్ పబ్లికేషన్ విన్‌ఫ్యూచర్ ప్రకారం.. షావోమీ 14టీ ధర 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 699 (దాదాపు రూ. 65వేల) నుంచి ప్రారంభమవుతుంది. లెమన్ గ్రీన్, టైటాన్ బ్లాక్, టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. అదే సమయంలో, షావోమీ 14టీ ప్రో అదే కాన్ఫిగరేషన్‌తో ఈయూఆర్ 899 (దాదాపు రూ. 84వేలు) ఖర్చవుతుంది. టైటాన్ బ్లాక్, టైటాన్ బ్లూ, టైటాన్ గ్రే కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది.
షావోమీ 14టీ సిరీస్ స్పెసిఫికేషన్‌లు (లీక్) :
షావోమీ 14టీ, షావోమీ 14టీ ప్రో మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్, 4వేల నిట్స్ గరిష్ట ప్రకాశం, షావోమీ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను ఉపయోగిస్తాయని నివేదిక తెలిపింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెండు స్మార్ట్‌ఫోన్‌లను 12జీబీ వరకు ఎల్‌పీపీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమీ హైపర్ఓఎస్‌లో రన్ కావచ్చు.
షావోమీ 14టీ మీడియాటెక్ డైమెన్సిటీ 8300-అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, డైమెన్సిటీ 9300+ ఎస్ఓసీ షావోమీ 14టీ ప్రోకి పవర్ అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెండు హ్యాండ్‌సెట్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు. షావోమీ 14టీలో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్906 సెన్సార్, షావోమీ 14టీ ప్రోలో 50ఎంపీ లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్ ఉన్నాయి. ఇతర కెమెరాల్లో 12ఎంపీ లైకా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపీ లైకా టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
ఈ రెండు ఫోన్‌లలో 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్, డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్పీకర్‌లు ఉంటాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000mAh బ్యాటరీలతో వస్తాయి. షావోమీ 14టీ ప్రో, షావోమీ 14టీ 67డబ్ల్యూ ఛార్జింగ్ వేగంతో పోలిస్తే.. వేగవంతమైన 120డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Read Also : Redmi 14R Launch : రెడ్‌మి కొత్త ఫోన్ చూశారా? భలే ఉందిగా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?