Redmi 14R Launch : రెడ్మి కొత్త ఫోన్ చూశారా? భలే ఉందిగా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
Redmi 14R Launch : రెడ్మి 14ఆర్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర ధర సీఎన్‌వై 1,099 (సుమారు రూ. 13వేలు) నుంచి ప్రారంభమవుతుంది.

Redmi 14R With 13-Megapixel Camera, Snapdragon 4 Gen 2 Chipset Launched
Redmi 14R Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? షావోమీ స్మార్ట్‌ఫోన్ సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో పాటు స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్సెట్ అమర్చింది. రెడ్మి ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. షావోమీ హైపర్ఓఎస్ స్కిన్‌తో వస్తుంది. 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,160mAh బ్యాటరీని అందిస్తుంది. రెడ్మి 13ఆర్ కి అప్‌గ్రేడ్ వెర్షన్ 13ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
Read Also : మీ టీవీ రిమోట్ పోయిందా? మీ స్మార్ట్‌టీవీని టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
రెడ్మి 14ఆర్ ధర ఎంతంటే? :
రెడ్మి 14ఆర్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర ధర సీఎన్‌వై 1,099 (సుమారు రూ. 13వేలు) నుంచి ప్రారంభమవుతుంది. వరుసగా సీఎన్‌వై 1,499 (దాదాపు రూ. 17,700), సీఎన్‌వై 1,699 (దాదాపు రూ. 20,100) ధరతో 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది. మరో 8జీబీ+256జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 1,899 (దాదాపు రూ. 22,500)కు అందిస్తుంది.
కొత్త రెడ్మి 14ఆర్ ఫోన్ చైనాలోని కంపెనీ వెబ్సైట్ ద్వారా డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్సెట్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టనుందా లేదా ప్రస్తుతానికి కంపెనీ రివీల్ చేయలేదు.
రెడ్మి 14ఆర్ స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) రెడ్మి 14ఆర్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్పై రన్ అవుతుంది. 600నిట్స్ గరిష్ట ప్రకాశంతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లో పేర్కొని సెకండరీ సెన్సార్‌తో పాటు 13ఎంపీ ప్రైమరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం ఫ్రంట్ సైడ్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉన్న 5ఎంపీ కెమెరాను కలిగి ఉంది.
మీరు రెడ్మి 14ఆర్‌లో 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని పొందుతారు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. రెడ్మి 14ఆర్ 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,160ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.