Xiaomi: వావ్.. షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది బాసూ.. లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరకు..
షియోమి 15 కనెక్టివిటీ పరంగానూ మంచి ఫీచర్లతో వచ్చింది.

Xiaomi 15
షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ షియోమి 15ను గత నెలలో భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది నేటి నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అత్యాధునికమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఇది విడుదలైంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో ఇది వచ్చింది.
షియోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, కొనుగోలు చేయడానికి ముందు, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలుసుకోండి.
షియోమి 15 ధర
దేశంలో షియోమి 15 ప్రారంభ ధర రూ.64,999. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.5,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే, ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే ఫోన్ ధర రూ. 59,999కి తగ్గుతుంది.
Also Read: ఇంటర్ విద్యార్థులు రెడీగా ఉండండి.. వాట్సాప్‌లో ఇలా పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..
షియోమి 15 ఫీచర్లు
షియోమి 15.. 6.36-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz కాగా, 1200×2670 (1.5K) రిజల్యూషన్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో రిలీజ్ అయింది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ మీద పనిచేస్తుంది. 12GB RAM ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,240mAh. ఇది 90W ఫాస్ట్ వైర్‌డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
షియోమి 15.. మూడు కెమెరాల సిస్టమ్‌తో వచ్చింది. ఈ ఫోన్ Xiaomi’s HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో Androidతో పనిచేస్తుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో రిలీజ్ అయింది. ఈ ఫోన్ బరువు 191 గ్రాములు మాత్రమే.
షియోమి 15 కనెక్టివిటీ పరంగానూ మంచి ఫీచర్లతో వచ్చింది. ఇందులో Wi-Fi 7, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, USB Type-C పోర్ట్ ఉన్నాయి. రెండు సిమ్ స్లాట్లలో 4G యాక్టివ్ స్టాండ్‌బై సపోర్ట్ కూడా ఉంది. షియోమి 15 ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌తో వచ్చింది.