Xiaomi Redmi 13C Launch : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. షావోమీ రెడ్‌మి 13C ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Xiaomi Redmi 13C Launch : షావోమీ నుంచి రెడ్‌మి 13సీ సిరీస్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజీతో హెలియో జీ85 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi Redmi 13C Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త 4జీ ఫోన్ వచ్చేసింది. అదే.. రెడ్‌మి 13సీ సిరీస్ ఫోన్.. ఈ 4జీ మోడల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో ఒకేసారి లాంచ్ అయింది. షావోమీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 12సీకి అప్ గ్రేడ్ వెర్షన్‌‌గా వచ్చింది. పోకో సీ65 ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది. రెడ్‌మి 13సీ ఫోన్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లు, డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లో మరే ఇతర ఫోన్ ఇలాంటి ఫీచర్లను ఆఫర్ చేయలేదు.

రెడ్‌మి 13సీ స్పెసిఫికేషన్స్:

సరికొత్త రెడ్‌మి 13సీ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్, 450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, వాటర్ డ్రాప్ నాచ్‌తో పాటు భారీ 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను పొందుతుంది. హుడ్ కింద రెడ్‌మి 13సీ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ, మాలి జీ52 జీపీయూ ద్వారా పవర్ అందిస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జీబీ ర్యామ్ వరకు అందించవచ్చు. 256జీబీ వరకు స్టోరేజ్‌తో పాటు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను అందిస్తుంది. రెడ్‌మి 13సీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14పై రన్ అవుతుంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Redmi 12 Discount Sale : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రెడ్‌మి 12 5G.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

కనెక్టివిటీ పరంగా చూస్తే.. వినియోగదారులు డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, (GLONASS), గెలీలియో (BeiDou) పొందవచ్చు. అంతేకాదు.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా పొందవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు.

రెడ్‌మి 13సీ ధర :
కొత్త రెడ్‌మి 13సీ మోడల్ నైజీరియాలో 98,100 (నైజీరియన్ నైరా)కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదే భారత కరెన్సీలో 4జీ ర్యామ్ వేరియంట్ దాదాపు రూ. 10,200కు సొంతం చేసుకోవచ్చు. మిడ్-రేంజ్ 6జీబీ వేరియంట్ నైజీరియన్ నైరా 108,100 (సుమారు రూ. 11,200)కి అందుబాటులో ఉంది. అయితే, టాప్-ఎండ్ 8జీబీ వేరియంట్ దాదాపు రూ. 12,500కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొత్తం గ్లేసియర్ వైట్, క్లోవర్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, నేవీ బ్లూతో సహా నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వచ్చే జనవరిలో భారత మార్కెట్లో రెడ్‌మి 13సీ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Xiaomi Redmi 13C Launched Globally

రెడ్‌మి 13సీ మరిన్ని ఫీచర్లు :

డిస్‌ప్లే : రెడ్‌మి 13సీ 6.74-అంగుళాల హెచ్‌ప్లస్ డిస్‌ప్లేతో పాటు నాచ్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 720 X 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌
ప్రాసెసర్ : ఫోన్‌ మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్.
ర్యామ్ స్టోరేజ్ : ఈ ఫోన్ 4జీబీ/ 6జీబీ/ 8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మరింత విస్తరించవచ్చు.
ఆపరేటింగ్ సిస్టమ్ : రెడ్‌మి హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.
కెమెరాలు : రెడ్‌మి 13సీలో ట్రిపుల్ కెమెరా సెన్సార్లు, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలకు స్మార్ట్‌ఫోన్‌లో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ, ఛార్జింగ్ : ఫోన్ 18డబ్ల్యూ ఛార్జర్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీ
ఇతర ఫీచర్లు : సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్.
కనెక్టివిటీ : 4జీ, డ్యూయల్-బ్యాండ్ వైఫ్-వై, బ్లూటూత్, జీపీఎస్, ఛార్జింగ్ యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్.

రెడ్‌మి 13సీ డిజైన్ :
రెడ్‌మి 13సీ ఫోన్.. చాలా బడ్జెట్ ఫోన్‌ల మాదిరి సాధారణ డిజైన్‌ను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్ వాటర్‌డ్రాప్ నాచ్, ఫ్లాట్ ఎడ్జ్‌లు, స్క్రీన్ చుట్టూ లార్జ్ బెజెల్‌ ఉన్నాయి. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ రైట్ ఎడ్జ్ ఉన్నందున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కూడా రెట్టింపు అవుతుంది. బ్యాక్ సైడ్ రెండు వృత్తాకార రింగ్‌లు ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెన్సార్లు, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్‌ 50ఎంపీతో వచ్చింది.

Read Also : Redmi Phones Discounts : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ 3 ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు