Redmi Phones Discounts : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ 3 ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Redmi Phones Discounts : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ 3 ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Redmi Phones get huge discounts during Flipkart Big Billion Days Sale in Telugu

Redmi Phones Discounts : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) 2023 ఏడాదిలో అతిపెద్ద అమ్మకాలను విక్రయిస్తోంది. అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే డిస్కౌంట్‌లను పొందేందుకు రెడీగా ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale Offers) గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వివిధ బ్రాండ్‌ల నుంచి చౌక ధరలకు ఫోన్‌లను అందిస్తోంది.

Xiaomi, Vivo, OnePlus వరకు, అనేక ఫోన్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు సరైన సమయం కావచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా రెడ్‌మి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ 3 డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi Note 12 Pro 5G :
రెడ్‌మి నోట్ 12 ప్రో 5G సేల్ సమయంలో ప్రత్యేక ధరలో కూడా అందుబాటులో ఉంది. అసలు ధర రూ.27,999గా ఉన్న ఈ ఫోన్ రూ.20,999కి అందుబాటులోకి వచ్చింది. ఈ రెడ్‌మి ఫోన్ 8GB ROM +128 GB స్టోరేజ్ వేరియంట్‌గా ఉంటుందని గమనించాలి. 8GB + 256GB వేరియంట్ రూ. 22,999లకు అందుబాటులో ఉంది. 256GB వేరియంట్ వాస్తవ ధర రూ. 31,999కు పొందవచ్చు.

Read Also : Redmi Note 12 5G Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11వేల లోపు ధరకే రెడ్‌మి 5G ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

అందువల్ల, 8Gb +128GB వేరియంట్ 25 శాతం తగ్గింపును కలిగి ఉండగా, హై స్టోరేజీ వేరియంట్ 28 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 12 ప్రో 5G ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్ల (స్టార్‌డస్ట్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్)లో అందుబాటులో ఉంది.

Redmi 12 Series :
రెడ్‌మి 12 4G, రెడ్‌మి 12 5Gలతో కూడిన రెడ్‌మి 12 సిరీస్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ 2 ఫోన్‌లు 3 కలర్ ఆప్షన్లలో పాస్టెల్ బ్లూ, మూన్‌షైన్ సిల్వర్, జేడ్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి 12 4G ఫోన్ 2 వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో ఒకటి 4GB RAM, 128GB స్టోరేజ్, మరొకటి 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,999కి అందుబాటులో ఉంది. అయితే, 6GB RAM, 128GB వేరియంట్ రూ. 10,499కి లభిస్తుంది.

Redmi Phones get huge discounts during Flipkart Big Billion Days Sale in Telugu

Redmi Phones get huge discounts  

ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌లపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ ప్లాన్ చేస్తే.. డివైజ్ ధర మరింత తగ్గుతుంది. రెడ్‌మి 12 5G భారత మార్కెట్లో తొలిసారిగా లాంచ్ అయింది. ఈ 5G ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్‌ (4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB)లను కలిగి ఉంది. ఈ ఫోన్‌పై కూడా భారీ తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా, 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,390కి అందుబాటులో ఉంది.

Redmi Note 12 :
ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 12 బేస్ వేరియంట్, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో 39 శాతం తగ్గింపును కలిగి ఉంది. ఈ ఫోన్ 3 కలర్ ఆప్షన్ల (సన్‌రైజ్ గోల్డ్, లూనార్ బ్లాక్, ఐస్ బ్లూ)లో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ 64GB, 128GB, 64GB అనే 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.18,999కు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మి నోట్ 12 ప్రస్తుతం రూ.11,999కి విక్రయిస్తోంది. 128GB వేరియంట్ గురించి మాట్లాడితే.. ఈ 5G ఫోన్ రూ. 13,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.20,999 ఉంటుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ డివైజ్‌ల ధరను మరింత తగ్గించవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుంటే మరింత హై డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Redmi 12 Discount Sale : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రెడ్‌మి 12 5G.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!