Redmi 12 Discount Sale : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రెడ్‌మి 12 5G.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

Redmi 12 Discount Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale)లో అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి 12 5G ఫోన్ (Redmi 12 5G) సొంతం చేసుకోండి..

Redmi 12 Discount Sale : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రెడ్‌మి 12 5G.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

Redmi 12 available for under Rs 9,000 during Flipkart Big Billion Days sale, All details in Telugu

Redmi 12 Discount Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్‌ల (Flipkart Plus Subscribers) కోసం ఒక రోజు ముందుగానే ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, వివిధ గాడ్జెట్‌లు సేల్ సమయంలో ఆకట్టుకునే డిస్కౌంట్లతో విక్రయిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో, Redmi, Vivo, Samsung, Oppo, OnePlus ఇతర బ్రాండ్‌లు తమ డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు రూ. 10వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అయిన రెడ్‌మి 12 (Redmi 12 5G) ఫోన్ సేల్ సమయంలో 40 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ 5G వేరియంట్ కూడా 20 శాతం తగ్గింపుతో లభిస్తుంది.

Read Also :  Redmi Smart Fire 4K TV : కొత్త స్మార్ట్ టీవీ కావాలా? సరసమైన ధరకే రెడ్‌మి 4K స్మార్ట్ టీవీ.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

రెడ్‌మి 12 4G, రెడ్‌మి 12 5G తగ్గింపు :

Redmi 12 4G మోడల్ మొత్తం 2 వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో ఒకటి 4GB RAM, 128GB స్టోరేజ్, మరోకటి 6GB RAM, 128 GB స్టోరేజ్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999కి అందుబాటులో ఉండగా, 6GB RAM, 128 GB వేరియంట్ రూ. 10,499కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌లపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

Redmi 12 available for under Rs 9,000 during Flipkart Big Billion Days sale, All details in Telugu

Redmi 12 Discount Sale : Flipkart Big Billion Days sale

అలాగే, మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ ప్లాన్ చేస్తుంటే.. డివైజ్ ధర మరింత తక్కువగా ఉంటుంది. రెడ్‌మి 12 5G ఫోన్ భారత మార్కెట్లో తొలిసారిగా 3 స్టోరేజ్ (4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB) వేరియంట్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ కూడా భారీ తగ్గింపు అందిస్తోంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,390కి అందుబాటులో ఉంది. ఈ 2 ఫోన్‌లు మొత్తం పాస్టెల్ బ్లూ, మూన్‌షైన్ సిల్వర్, జేడ్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి 12 4G, రెడ్‌మి 12 5G టాప్ స్పెషిఫికేషన్లు :

రెడ్‌మి 12 4G గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ప్రీమియం లుక్ కలిగి ఉంది. పైభాగంలో, కెమెరా లెన్స్‌ల చుట్టూ సిల్వర్ మెటాలిక్ రిమ్‌లతో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ బరువు దాదాపు 198.5 గ్రాములు ఉంటుంది. ఈ రెడ్‌మి ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 3 వైపులా స్లిమ్ బెజెల్స్‌తో పంచ్-హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ చిన్ మీద కొంచెం మందంగా ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో వస్తుంది. 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి 12 5G ఫోన్ కూడా 4G ఫోన్ మాదిరిగానే డిజైన్‌తో వస్తుంది.

రెడ్‌మి 12 4G మాదిరిగానే ఈ 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 3 వైపులా స్లిమ్ బెజెల్స్‌తో పంచ్-హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 2MP డెప్త్ కెమెరా, LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కెమెరా 8MPతో వస్తుంది. బాక్స్ వెలుపల, రెడ్‌మి 12 5G ఫోన్ MIUI 14 (Android 13 ఆధారంగా)పై రన్ అవుతుంది. MIUI డయలర్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను అందిస్తుంది. రెడ్‌మి 12 ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. టైప్-C USB పోర్ట్ ద్వారా 18W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : iPhone 15 Overheat Fix : ఐఫోన్ 15 యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త iOS 17 అప్‌డేట్ ఆగయా.. బగ్ ఫిక్స్ కోసం ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!