Redmi Smart Fire 4K TV : కొత్త స్మార్ట్ టీవీ కావాలా? సరసమైన ధరకే రెడ్‌మి 4K స్మార్ట్ టీవీ.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Redmi Smart Fire 4K TV : రెడ్‌మి స్మార్ట్ ఫైర్ 4K టీవీ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 26,999గా కంపెనీ నిర్ణయించింది. వినియోగదారులు లిమిటెడ్ ఆఫర్ కింద రూ.24,999కి టీవీని సొంతం చేసుకోవచ్చు.

Redmi Smart Fire 4K TV : కొత్త స్మార్ట్ టీవీ కావాలా? సరసమైన ధరకే రెడ్‌మి 4K స్మార్ట్ టీవీ.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Redmi Smart Fire TV 4K launched in India priced at Rs 26,999, all you need to know

Redmi Smart Fire 4K TV : కొత్త టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. రెడ్‌మి (Redmi) ఇప్పుడే సరసమైన స్మార్ట్ 4K టీవీని ఆవిష్కరించింది. 4K టీవీ కోసం చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Fire OS) ద్వారా ఆధారితమైన (Redmi Smart Fire TV 4K)ని కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఏడాది ప్రారంభంలో మార్చిలో రెండు కంపెనీలు Redmi Smart Fire TV 32ని ప్రవేశపెట్టాయి. ఈ రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 4K హై-క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ యూజర్ల కోసం అందిస్తోంది.

షావోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ.. ‘4K 108cm స్మార్ట్ టీవీలు భారత మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ టీవీ మోడల్స్‌లో ఒకటి. రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని 81cm, రెడ్‌మి స్మార్ట్‌ ఫైర్ టీవీ 4Kని 108cm వేరియంట్‌లో మాత్రమే అమెజాన్‌ అందిస్తోంది. కానీ ‘అందరికీ 4K స్మార్ట్ టీవీలను అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాం. మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లు 4K రిజల్యూషన్‌లో కంటెంట్‌ను అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కస్టమర్‌లు ఎక్కువగా 4K టీవీలను కోరుకునే ఫీచర్‌లలో ఇదొకటి అవుతుంది’ అని ఆయన అన్నారు.

Read Also : iPhone NavIC Support : ఆపిల్ ఫ్యాన్స్ ఇది విన్నారా?.. కొత్త ఐఫోన్ 15 ప్రోలో శాటిలైట్ నావిగేషన్ NavIC సిస్టమ్.. ఐఫోన్లలో ఇదే ఫస్ట్ టైం.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

అమెజాన్ ఇండియాలో వైర్‌లెస్ & హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ రంజిత్ బాబు మాట్లాడుతూ.. అమెజాన్‌లో మా కస్టమర్‌లకు స్పీడ్, సేఫ్ డెలివరీ సౌలభ్యంతో పాటు చాలా విలువైన టెలివిజన్‌ల విస్తృత పోర్ట్‌ఫోలియోను అందించడంపై ఫోకస్ చేస్తున్నామని అన్నారు. కొత్త రెడ్‌మి స్మార్ట్ (Amazon.in) మార్కెట్‌ప్లేస్‌కి (Fire TV)ని అందిస్తోంది. ఎందుకంటే.. కస్టమర్‌లకు DTH నుంచి OTT కంటెంట్‌కు సులభంగా మారవచ్చు. ఈ టీవీని 4Kకి అప్‌గ్రేడ్ చేసేందుకు టీవీ ఆప్షన్ మారుతుందని భావిస్తున్నామని రంజిత్ బాబు పేర్కొన్నారు.

రెడ్‌మి స్మార్ట్‌టీవీ ఫైర్ టీవీ 4K లాంచ్ ధర ఎంతంటే? :
రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 4K ధర రూ.26,999. అయితే, పరిమిత సమయం వరకు షావోమీ ప్రత్యేక ధర రూ. 24,999 వద్ద టీవీని అందిస్తోంది. అమెజాన్, Mi వెబ్‌సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్‌లో టీవీ అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి ప్రస్తుతానికి సేల్ డేట్ పేర్కొనలేదు.

రెడ్‌మి ఫైర్ టీవీ 4K టాప్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి ఫైర్ 4K TV 108cm స్క్రీన్ పరిమాణంతో వస్తుంది. Fire OSలో రన్ అవుతుంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీతో 4K అల్ట్రా HD రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 24W స్పీకర్లు, డాల్బీ ఆడియో, DTS వర్చువల్ X టెక్నాలజీని కలిగి ఉంది. క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టీవీ లోయర్ డిజైన్‌ను కలిగి ఉంది. అమెజాన్‌తో భాగస్వామ్యం కారణంగా సరికొత్త Redmi Fire TV ఇంటర్నల్ (Alexa)తో వస్తుంది. టీవీ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు డ్యూయల్-బ్యాండ్ వైఫైని కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీ పిక్చర్-ఇన్-పిక్చర్ టెక్నాలజీని కూడా అందిస్తోంది. మీ టీవీ వ్యూ ఎక్స్ పీరియన్స్ ఎలాంటి అంతరాయం కలిగించకుండా మల్టీ టాస్క్ నిర్వహించడానికి అనుమతిస్తుంది.

Redmi Smart Fire TV 4K launched in India priced at Rs 26,999, all you need to know

Redmi Smart Fire 4K TV Launch in India priced at Rs 26,999, all you need to know

టీవీ హోమ్‌పేజీ ఫైర్ OS స్కిన్‌ను కలిగి ఉంది. స్మార్ట్ హబ్ కంట్రోల్ కలిగి ఉంది. వినియోగదారులు విభిన్న వ్యూ ప్రొఫైల్‌లను కూడా క్రియేట్ చేయొచ్చు. వ్యూ హిస్టరీ ప్రతి ప్రొఫైల్‌లో సేవ్ అవుతుంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా, G5 మొదలైన వాటితో సహా 12వేలకు పైగా యాప్‌లలో కస్టమర్‌లు మిలియన్ కన్నా ఎక్కువ సినిమాలు, టీవీ షో ఎపిసోడ్‌లను వీక్షించవచ్చు. అదనంగా, కస్టమర్‌లు Amazon miniTV, ప్రముఖ లైవ్ ఛానెల్‌లను కూడా ప్రసారం చేయవచ్చు.

కొత్త టెలివిజన్ (Apple Airplay), (Miracast)లకు కూడా సపోర్టు ఇస్తుంది. రెడ్‌మి టీవీతో పాటు వచ్చే రిమోట్ డిజైన్‌ను కూడా మార్చింది. రిమోట్‌లో మినిమలిస్ట్ డిజైన్, డెడికేటెడ్ అలెక్సా బటన్ ఉన్నాయి. తద్వారా వినియోగదారులు టీవీకి సూచనలను అందించవచ్చు. ఒక యూజర్ చేయాల్సందిల్లా.. టీవీ ఛానెల్‌ని మార్చడం, వాయిస్‌ని మ్యూట్ చేయడం, నిర్దిష్ట OTT షోకి మారమని అలెక్సాకు చెప్పాల్సి ఉంటుంది. రిమోట్‌కి మ్యూట్ బటన్ కూడా ఉంది. ఇంకా, రిమోట్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ కోసం క్విక్ లాంచ్ బటన్‌లను కూడా అందిస్తుంది.

Read Also : iPhone 14 Series Price Cut : ఐఫోన్ 15 సిరీస్ రాగానే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?