iPhone 15 Overheat Fix : ఐఫోన్ 15 యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త iOS 17 అప్‌డేట్ ఆగయా.. బగ్ ఫిక్స్ కోసం ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

iPhone 15 Overheat Fix : ఆపిల్ ఐఫోన్ (iPhone 15 Users) వినియోగదారులు ఎదుర్కొనే హీటింగ్ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో (iOS 17.0.3) కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లో 2 సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా ఉన్నాయి.

iPhone 15 Overheat Fix : ఐఫోన్ 15 యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త iOS 17 అప్‌డేట్ ఆగయా.. బగ్ ఫిక్స్ కోసం ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Apple release new iOS 17 update, fixes bug which is causing iPhone 15 overheat in Telugu

iPhone 15 Overheat Fix : ఆపిల్ ఐఫోన్ 15 యూజర్లకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 సిరీస్ హీటింగ్ సమస్యకు చక్కని పరిష్కారం దొరికింది. ఐఫోన్ 15 హీటింగ్ సమస్య (Apple iPhone 15 Overheating issue)ను పరిష్కరించే iOS 17.0.3 అప్‌డేట్‌ను ఆపిల్ కంపెనీ రిలీజ్ చేసింది. చాలా మంది (iPhone 15) వినియోగదారులు iOS 17.0.2కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత యూజర్ల ఐఫోన్ డివైజ్‌లు వేడిగా రన్ అవుతున్నాయని నివేదించారు.

బగ్ ఇష్యూను ఫిక్స్ చేసిన ఆపిల్ :

ఆపిల్ (Apple) మొదటి అప్‌డేట్ వారం క్రితమే రిలీజ్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్, ఉబెర్ వంటి నిర్దిష్ట యాప్‌లు, డేటా ట్రాన్స్‌ఫర్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసింగ్, iOS 17లోని కొన్ని బగ్‌లతో సహా వివిధ కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆపిల్ కొత్త అప్‌డేట్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ కొత్త అప్‌డేట్ iOS 17.0.3 ద్వారా అదనపు భద్రత, బగ్ ఇష్యూను పరిష్కరించినట్టు వెల్లడించింది.

కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం iOS 17 కొత్త అప్‌డేట్‌ను బుధవారం రాత్రి (అక్టోబర్ 4న) ఆలస్యంగా రిలీజ్ చేసింది. బిల్డ్ 21A360. iOS 17.0.3 ఐఫోన్ ఊహించిన దాని కన్నా హీటింగ్ కారణమయ్యే సమస్యను పరిష్కరిస్తుందని ప్యాచ్ నోట్స్‌తో కంపెనీ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ చేసింది.

Read Also : iPhone 12 Sale on Flipkart : రూ.32,999 ధరకే ఆపిల్ ఐఫోన్ 12 సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనాలా? వద్దా?

ఆపిల్ గతంలో సెప్టెంబరులో హీటింగ్ సమస్యకు కారణమయ్యే బగ్‌ను ధృవీకరించింది. iOS కొత్త అప్‌డేట్ ద్వారా పరిష్కరించనున్నట్టు తెలిపింది. కొత్త వెర్షన్ అప్‌డేట్‌తో పాటు, A17 ప్రో చిప్‌ ఓవర్‌లోడింగ్, వేడెక్కడం సమస్యలను కలిగించే యాప్‌లను ఆప్టిమైజ్ చేసేందుకు యాప్ డెవలపర్‌లతో ఆపిల్ పని చేస్తోంది.

కొత్త iOS 17.0.3 అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోండి :

iOS 17.0.3 లేదా iPadOS 17.0.3కి అప్‌డేట్ చేసేందుకు అర్హత ఉన్న వినియోగదారులు Settings > General> Software Update ద్వారా అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా, అనేక రిపోర్టుల్లో ఐఫోన్ 15 హీటింగ్ సమస్య థర్మల్ సిస్టమ్, A17 ప్రో చిప్ లేదా టైటానియం భాగాలలో డిజైన్ లోపాల నుంచి ఉద్భవించిందని సూచించాయి. (Macrumors) నివేదికలో ఆపిల్ విశ్లేషకుడు (Ming-Chi Kuo) థర్మల్ సిస్టమ్ డిజైన్‌ కారణంగా డివైజ్ వేడెక్కడం జరిగిందని పేర్కొన్నారు. ఆపిల్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ తగ్గించడం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించగలదని సూచించారు.

Apple release new iOS 17 update, fixes bug which is causing iPhone 15 overheat in Telugu

iPhone 15 Overheat Fix : Apple release new iOS 17 update

అయినప్పటికీ, ఆపిల్ ఈ వాదనలను తిరస్కరించింది. A17 ప్రో చిప్‌ను సవరించే ఉద్దేశ్యం లేదని తెలిపింది. టైటానియం, అల్యూమినియం డిజైన్, వాస్తవానికి, గత మోడల్‌లతో పోలిస్తే.. మెరుగైన హీటింగ్ వెదజల్లుతుందని పేర్కొంది. హీటింగ్ సమస్యకు పరిష్కారంగా ఆపిల్ iOS 17.0.3, iPadOS 17.0.3లో 2 భద్రతా ప్యాచ్‌లను కూడా రిలీజ్ చేసింది.

iOS 16.6కి ముందు iOS వెర్షన్‌లలో ఈ ప్యాచ్ యాక్టివ్‌గా ఉపయోగించుకోవచ్చని టెక్ దిగ్గజ కంపెనీ తెలిపింది. ఇతర ప్యాచ్ (libvpx)లోని బగ్‌ను పరిష్కరిస్తుంది. ఎవరైనా డివైజ్ రిమోట్‌గా కంట్రోల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. (Chrome), (Firefox) వంటి యాప్‌లలో కూడా ఈ బగ్ ఇష్యూకు సంబంధించి ఇటీవల ప్యాచ్ అందించింది. ఆపిల్ ప్రస్తుతం ముఖ్యమైన iOS 17.1 అప్‌డేట్‌పై బీటాలో టెస్టింగ్ చేస్తోంది.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!