Yamaha FZ-S Fi : వారెవ్వా.. సూపర్ బైక్.. యమహా FZ-S Fi హైబ్రిడ్ అదుర్స్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

Yamaha FZ-S Fi : యమహా భారత మార్కెట్లో FZ-S Fi హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైకు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి..

Yamaha FZ-S Fi Hybrid

Yamaha FZ-S Fi Launch : యమహా లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సరికొత్త యమహా బైక్ వచ్చేసింది. ఇండియా యమహా మోటార్ (IYM) FZ-S Fi హైబ్రిడ్‌ను లాంచ్ చేసింది. ఈ బైకు రూ.1,44,800 (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చింది. దేశంలో యమహా మొట్టమొదటి హైబ్రిడ్ మోటార్‌సైకిల్ నాన్-హైబ్రిడ్ (FZ-S Fi) వేరియంట్ కన్నా రూ.10వేల ప్రీమియంను కలిగి ఉంది.

Read Also : Summer AC Offers : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీలపై 50 శాతం డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఏసీని కొని ఇంటికి తెచ్చుకోండి!

యమహా FZ-S Fi బైకులో 149-CC బ్లూ కోర్ ఇంజిన్ ఉంది. OBD-2Bకి సపోర్టు చేస్తుంది. ఈ ఇంజిన్ యమహా స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG), స్టాప్, స్టార్ట్ సిస్టమ్ (SSS)లతో అమర్చి ఉంది. ఈ టెక్నాలజీలతో బ్యాటరీ-అసిస్టెడ్ యాక్సలరేషన్ ఇంజిన్‌ను ఆటోమాటిక్‌గా ఆగిపోయేలా చేస్తుంది. తద్వారా క్లచ్‌తో ఇంజిన్ రీస్టార్ట్ చేయొచ్చు.

డిజైన్ చాలావరకు ఒకేలా ఉంటుంది. కీలకమైన డిజైన్ అప్‌డేట్‌ ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎయిర్ ఇన్‌టేక్ ఏరియాలో అమర్చారు. కొత్త FZ-S Fi హైబ్రిడ్ 4.2-అంగుళాల ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రవేశపెట్టింది.

స్మార్ట్ ఫోన్లతో కనెక్టింగ్ యాప్ :
Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేసిన టర్న్-బై-టర్న్ (TBT) నావిగేషన్‌ను కలిగి ఉంది. రియల్-టైమ్ డైరెక్షన్స్, నావిగేషన్ ఇండెక్స్, ఇంటర్ సెక్షన్ డిటైల్స్, రహదారి పేర్లను కూడా సూచిస్తుంది.

లాంగ్ రైడ్స్‌ చేసే రైడర్ల కోసం హ్యాండిల్‌బార్ పొజిషన్‌ కూడా ఆప్టిమైజ్ చేసినట్లు యమహా తెలిపింది. యాక్సెసిబిలిటీ కోసం హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌లు అడ్జెస్ట్ చేసింది. రైడర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా హార్న్ స్విచ్‌ను అమర్చారు.

ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పుడు ఎరోప్లేన్ స్టయిల్ ఫ్యూయల్ క్యాప్ కలిగి ఉంది. ఫ్యూయల్ నింపేటప్పుడు వీలుగా ఉండేలా లింక్ చేసి ఉంటుంది. కొత్త 2025 FZ-S Fi హైబ్రిడ్ రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : iQOO Z10 Series : ఏప్రిల్‌లో ఐక్యూ Z10 సిరిస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఓసారి లుక్కేయండి!

యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఇటారు ఒటాని మాట్లాడుతూ.. “ఈ సిగ్మెంట్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టి పర్ఫార్మెన్స్ పరంగా అడ్వాన్స్‌డ్ రైడర్-ఫోకస్డ్ బైకులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యమహా FZ సిరీస్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కస్టమర్లను ఆకర్షించేలా డిజైన్ చేశాం. క్లీన్, డైనమిక్ ఆకర్షణీయమైన రైడింగ్‌ను అందిస్తుంది’’అని అన్నారు.