Whatsapp డేటాకు హ్యాకింగ్ ముప్పు.. ఇలా తప్పించుకోవచ్చు!

  • Published By: sreehari ,Published On : October 7, 2020 / 08:15 PM IST
Whatsapp డేటాకు హ్యాకింగ్ ముప్పు.. ఇలా తప్పించుకోవచ్చు!

Updated On : October 7, 2020 / 8:47 PM IST

Whatsapp Data : మీ వాట్సాప్ డేటాకు హ్యాకింగ్ ముప్పు ఉంది జాగ్రత్త.. డేటా హ్యాకింగ్ చేసేందుకు ఎప్పటికప్పుడూ హ్యాకర్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. వాట్సాప్ ఎంతగా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీని అందుబాటులోకి తీసుకొచ్చిన పెద్దగా డేటాకు రక్షణ కరవైపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాట్సాప్ డెవలపర్లు చెబుతున్నా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ పూర్తి స్థాయిలో డేటాను సురక్షితంగా ఉంచలేదని అంటున్నారు. అలాంటప్పుడు హ్యాకర్ల చేతుల్లోకి డేటా వెళ్లే ప్రమాదం ఉంది.



మరి.. వాట్సాప్ డేటాను హ్యాకర్ల బారినుంచి కాపాడుకోలేమా అంటే.. ఏదైనా మార్గం లేదా? అంటే కచ్చితంగా ఉందనే చెప్పాలి.. కేవలం వాట్సాప్ సెట్టింగ్ లలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.. వాట్సాప్ డేటా సురక్షితంగా ఉండేందుకు ఇదే సరైన మార్గమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



వాట్సాప్‌లోని చాటింగ్‌ డేటా డిఫాల్ట్‌గా ప్రతిరోజూ గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాకప్‌ అవుతుంది. గూగుల్‌ డ్రైవ్‌లోని డేటా కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని చెబుతోంది వాట్సాప్.. కానీ, ఇందులోనే ఎక్కువగా యూజర్ల డేటా లీక్‌ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Whatsapp Chat Backup విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ డేటాను ఎలా భద్రపరుచుకోవాలో చూద్దాం..



ఈ కింది విధంగా ఫాలో అవ్వండి :
* వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
* సెట్టింగ్స్‌ ‘ఆప్షన్‌’పై క్లిక్‌ చేయండి.
* అక్కడే మరో Menu ఓపెన్‌ చేయండి.
* డార్క్‌ కలర్‌లో ఉండే ‘Backup‌’పై Click చేయండి.
* ఇక్కడ 5 ఆప్షన్లు కనిపిస్తాయి.
* అక్కడ ‘never’ లేదా ‘only when i tap backup’ ఆప్షన్లను సెలెక్ట్‌ చేయండి.
* రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేయండి.
* ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ ప్రాసెస్‌ జరగదు.
* ఇకపై చాటింగ్‌ డేటా గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళ్లదు.
* చాటింగ్‌ డేటా బ్యాకప్‌ తీసుకోవాలంటే మాత్రం వైఫై ద్వారా చేయొద్దు.
* మొబైల్‌ డేటా ద్వారా మాత్రమే చేసేందుకు ప్రయత్నించండి.
* మీ డేటా హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ వాట్సాప్ అకౌంట్లో చాట్ డేటాను సురక్షితంగా బ్యాకప్ చేయండి.. ఈ డేటాను హ్యాకర్ల బారిన పడకుండా జాగ్రత్త పడండి..