Zomato Bumper Offer : జొమాటోలో బగ్ కనిపెట్టండి.. రూ.3 లక్షలు గెల్చుకోండి!

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం Zomato కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. జొమాటో కంపెనీ వెబ్ సైట్ లేదా యాప్‌లో బగ్ కనిపెడితే లక్షల రివార్డ్ ఇస్తామంటోంది. బగ్ కనిపెట్టిన వారు రూ.3 లక్షల గెల్చుకోవచ్చుంటూ ఆఫర్ చేస్తోంది.

Zomato Will Give Rs 3 Lakh If You Find A Bug In Its Website, App

Zomato Bumper Offer : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం Zomato కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. జొమాటో కంపెనీ వెబ్ సైట్ లేదా యాప్‌లో బగ్ కనిపెడితే లక్షల రివార్డ్ ఇస్తామంటోంది. బగ్ బౌండీ ప్రొగ్రామ్ (Bug Bounty Programme)కింద బగ్ కనిపెట్టిన వారికి (4వేల డాలర్లు) రూ.3 లక్షల గెల్చుకోవచ్చుంటూ ఆఫర్ చేస్తోంది. జొమాటో టెక్నాలజీ రీసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు ఆఫర్ అందిస్తోంది.

IPO ప్రమోషన్‌, యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్‌పెట్టేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను గుర్తించిన వారికి ఈ రివార్డును ఇవ్వనుంది. జూలై 8న అధికారికంగా ఈ ఆఫర్ ప్రకటించింది. బగ్స్‌ ఫిక్స్ చేయడాన్ని బట్టి రివార్డు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంటుందని జొమాటో సెక్యూరిటీ ఇంజనీర్‌ యష్‌ సోధా (Yash Sodha) ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా కోరారు.

జొమాటో బగ్స్ కనుగొనేందుకు కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్‌ Common Vulnerability Scoring System (CVSS) విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్కోరింగ్ ఆధారంగా రివార్డు విలువను సంస్థ లెక్కిస్తుంది.


హాని కలిగించే బగ్‌ (critical vulnerability)ను గుర్తించినవారికి CVSS స్కోర్ 10.0గా ఉంటుంది. అలా వారు 4వేల డాలర్లు గెల్చుకోవచ్చు. ఈ స్కోరు CVSS 9.5 ఉంటే.. రివార్డు 3వేల డాలర్ల వరకు ఉంటుంది. జొమాటో బగ్ కౌంటీ ప్రొగ్రామ్‌లో పాల్గొనాలంటే two-factor authentication ఎనేబుల్ అయి ఉండాలి. అప్పుడే పాల్గొనేందుకు వీలుంటుంది.