Congress : కాంగ్రెస్ సీటు కోసం 1000 మంది దరఖాస్తు.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, దరఖాస్తు చేయని ఐదుగురు ముఖ్య నేతలు

అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. రేపటి (శనివారం) నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.

Congress : కాంగ్రెస్ సీటు కోసం 1000 మంది దరఖాస్తు.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, దరఖాస్తు చేయని ఐదుగురు ముఖ్య నేతలు

Telangana Congress (1)

Updated On : August 25, 2023 / 5:41 PM IST

Applied For Congress Seat : కాంగ్రెస్ సీటు కోసం గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ సీటు కోసం అభ్యర్థుల నుంచి దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చాయి. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. రేపటి (శనివారం) నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.

పలువురు ముఖ్య నేతలు దరఖాస్తులు దాఖలు చేశారు. కాగా మరో ఐదుగురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కె.జానారెడ్డి, రేణుకాచౌదరి, నాగం జనార్దన్ రెడ్డి, గీతారెడ్డి, వి.హనుమంతరావు దరఖాస్తు చేయలేదు. కాంగ్రెస్ సీటు కోసం సినీ నిర్మాత అప్పి రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల టికెట్ కోసం జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అప్పి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు.

Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత అప్పి రెడ్డి.. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో

ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అప్పిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పి రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తమ్ దంపతులు పోటీ చేసినా మద్దతు ఇస్తానని, తనకు అవకాశం ఇచ్చినా తాను పోటీ చేస్తానని చెప్పారు.

ముఖ్య నేతలు దరఖాస్తు
కొడంగల్ – రేవంత్ రెడ్డి, మధిర – భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగిత్యాల – జీవన్ రెడ్డి, కామారెడ్డి – షబ్బీర్ అలీ, వరంగల్ తూర్పు – కొండా సురేఖ, పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆంధోల్ – దామోదర రాజనర్సింహ, మంథని – శ్రీధర్ బాబు, సంగారెడ్డి- జగ్గారెడ్డి, కోదాడ – పద్మావతి ఉత్తమ్ దరఖాస్తు దాఖలు చేశారు.

Bandi Sanjay Fires on CM KCR : నటనలో కేసీఆర్‎ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్

నాగార్జున సాగర్ – జైవీర్ రెడ్డి (జానారెడ్డి చిన్న కుమారుడు), మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి (జానారెడ్డి పెద్ద కుమారుడు), ఎల్ బీ నగర్ – మధు యాష్కీ గౌడ్, జనగాం- పొన్నాల లక్ష్మయ్య, ములుగు – సీతక్క, వనపర్తి – చిన్నారెడ్డి, ముషీరాబాద్ – అంజన్ కుమార్, అనిల్ కుమార్ (తండ్రి కొడుకులు), తుంగతుర్తి – అద్దంకి దయాకర్, మంచిర్యాల- ప్రేమ్ సాగర్ రావు, హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ -సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు.