Sabitha Indra Reddy : అసెంబ్లీలో వాగ్వాదంపై సబిత వెర్షన్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డితో గ్యాస్ ఎక్కడ వచ్చింది? సబిత, రేవంత్ లలో ఎవరు ఎవరిని మోసం చేశారు? అసలు సబిత పార్టీ ఎందుకు మారారు? మళ్లీ సబిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో వీకెండ్ ఇంటర్వ్యూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేవెళ్ల చెల్లెమ్మ అనగానే గుర్తొచ్చే పేరు సబితా ఇంద్రారెడ్డి. నలుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో ఆమె మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డికి, సబితకు మధ్య జరిగిన వాగ్వాదం అంతా ఇంతా కాదు. అసలు ఆ వాగ్వాదానికి కారణం ఏంటి. గతంలో అక్క, తమ్ముడిలా మెలిగిన సబిత, రేవంత్.. ఇప్పుడు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. వీరిద్దరి మధ్య ఎందుకింత వైరం ఏర్పడింది. అసలు రేవంత్ రెడ్డితో సబితకు ఎక్కడ చెడింది?
Also Read : విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ నేతల తంటాలు