TSLPRB: తెలంగాణలోని పోలీసు ఉద్యోగాల నియామకం కోసం టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు ముగిశాయి. దాదాపు నెల రోజులపాటు నిర్వహించిన వివిధ ఫిజికల్ టెస్టుల్లో మొత్తం 1,11,209 మంది అర్హత సాధించినట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది.
Plane Crashes: పొగ మంచు కారణంగా గుడిని ఢీకొన్న విమానం.. పైలట్ మృతి
ఈ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో దశలవారీగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించగా, ఈ నెల 5తో ముగిశాయి. ఈ సారి ఫిజికల్ ఈవెంట్లలో పాసై, తుది పరీక్షలకు అర్హత సాధించిన వారి శాతం 53.70గా ఉంది. అంతకుముందు 2018-19లో నియామకాలు జరిపినప్పుడు 48.52 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.
వచ్చే మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పోలీస్ ఉద్యోగాలకు తుది పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్స్ కోసం సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ద్వారా 17,516 మంది సిబ్బందిని నియమించబోతోంది బోర్డు.