Drugs Seized In ShamshabadAirport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.21.90 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ఇన్నాళ్లు బంగారం అక్రమ రవాణకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పుడు మరో కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా..

Drugs Seized In ShamshabadAirport : ఇన్నాళ్లు బంగారం అక్రమ రవాణకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పుడు మరో కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. ఏకంగా రూ.21.90 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నైరోబీ నుంచి వచ్చిన మహిళ దగ్గరి నుంచి 3.12 కేజీల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Wife Slits Husbands Throat : అనకాపల్లి పుష్ప ఘటన తరహాలో మరో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య

ఆ మహిళ ఖతార్ ఎయిర్ వేస్ లో నైరోబీ నుంచి వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ లో పాలిథిన్ కవర్లలో డ్రగ్స్ పెట్టుకుని వచ్చింది. అయితే, అధికారులు ఆమెని పట్టేశారు. డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు. నిందితురాలిని మాలి దేశస్తురాలిగా అధికారులు గుర్తించారు. ఆమెని అదుపులోకి తీసుకున్న అధికారలు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ని ఏయే ప్రాంతాల్లో సప్లయ్ చేయడానికి, ఎక్కడ అమ్మేందుకు తీసుకొచ్చిందనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా, డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి అధికారులకు ముందే పక్కా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు.

Gujarath : గుజరాత్​లో పాకిస్తాన్‌కు చెందిన పడవలో నుంచి రూ.280 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అధికారులు ఎంత నిఘా పెట్టినా కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. గోల్డ్, డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. అయితే, అధికారులు కూడా అదే రీతిలో నిఘా పెడుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని వేషాలు వేసినా ఇట్టే పట్టేస్తున్నారు. వారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు