CM KCR : గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు

సీఎం కేసీఆర్ పై పోటీకి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు 43మంది. దీంతో గజ్వేల్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది.

CM KCR

Telangana Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. గులాబీ బాస్ కేసీఆర్ అయితే తన వయస్సును.. ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి రోజుకు రెండు మూడు సభల్లో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు కూడా తమదైన శైలిలో సభలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..సీఎం కేసీఆర్ పై పోటీ అంటూ పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టినట్లే అంటూ ప్రతిపక్ష పార్టీలపై సెటైర్లు వేస్తున్నారు.

కానీ కేసీఆర్ పై పోటీకి బీజేపీ నుంచి ఈటల రాజేందర్..అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతేకాదు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీకి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు సామాన్యులు కూడా. దీంట్లో భాగంగానే ఏకంగా సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఏకంగా 145మంది నామినేషన్లు వేశారు. కాని నామినేషన్ల తిరస్కరణ..ఉపసంహరణ ప్రక్రియ ముగిసాక 70మంది అభ్యర్ధుల నామినేషన్ల ఉపసంహరణ..తిరస్కరణ జరిగింది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసాక కూడా 43మంది అభ్యర్ధులు సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్దంగా ఉన్నారు. అంటే కేసీఆర్ తో కలిపి గజ్వేల్ బరిలో 44మంది అభ్యర్ధులు పోటీకి సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ అభ్యర్థి, ఆయన అనుచరుల నివాసాల్లో సోదాలు

దీంతో ఈసీ అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేసే ప్రక్రియలో ఉన్నారు. 44మంది అభ్యర్ధలకు మూడు బ్యాలెట్లు అవసరం ఉంటుందని భావిస్తున్నారు ఈసీ అధికారులు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యా కూడా గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీకి 44 మంది బరిలోకి నిలవడం హైలేట్ అనే చెప్పాలి.

కాగా..2019 ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై ఏకంగా 176మంది రైతులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయగా..ఆమెపై 176మంది రైతులు పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో కవిత ఓటమిపాలైన విషయం తెలిసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత పెరగటం వల్లే గజ్వేల్ నుంచి 44మంది పోటీకి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంతమంది ఏకంగా కేసీఆర్ పై పోటీకి సిద్ధం కావటం విశేషంగా మారింది.

బీజేపీకి విజయశాంతి రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి? ఎప్పుడంటే ..

స్థానికంగా ఉన్న భూనిర్వాసితులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, చెరుకు రైతులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయగా వారితో విత్‌​డ్రా చేయించడంలో బీఆర్ఎస్ లీటర్లు చొరవచూపినట్లుగా తెలుస్తోంది. దీంతో 70మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని సమాచారం.