IT Raids : తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల నివాసాల్లో సోదాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Raids : తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల నివాసాల్లో సోదాలు

IT Raids

Updated On : November 16, 2023 / 11:12 AM IST

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు, వారి అనుచరుల ఇండ్లలో ఐటీ సోదాలు జరగ్గా.. గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి, వారి అనుచరుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థిగా నల్లమోతు భాస్కర్ రావు బరిలో ఉన్నారు. ఆయన నివాసంపై తెల్లవారు జామున 4గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకోసం భాస్కర్ రావు భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Also Read : Vijayashanti: బీజేపీకి విజయశాంతి రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి? ఎప్పుడంటే ..

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో 30బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భాస్కర్ రావు ముఖ్యఅనుచరుడు శ్రీధర్ నివాసంతోపాటు రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో యూపీకి సంబంధించి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 20 కార్లలో 40 మంది అధికారులు మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంతాలకు చేరుకొని ఏకకాలంగా దాడులు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఈ సోదాలు కొనసాగుతాయని తెలుస్తోంది.

Also Read : Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

నల్గొండలోని రవీందర్ నగర్, పాత బస్తీల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెహ్రూగంజ్ లో మహేంద్ర ఆయిల్ మిల్ లో, మిల్ యజమాని కందుకూరి మహేందర్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరికి చెందిన వజ్రతేజ రైస్ మిల్ లోనూ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఇంటిపైకూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావుకు స్వయానా శ్రీనివాసరావు మేనల్లుడు. ప్రస్తుతానికి ఆర్ సీపురం విజిలెన్స్ ఎస్పీగా శ్రీనివాస్ రావు కొనసాగుతున్నారు. శ్రీనివాసరావు ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

 

నాపై ఐటీ దాడులు జరగలేదు.. అదంతా ప్రచారమే ..
మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు ఐటీ సోదాలపై స్పందించారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద ఐటీ దాడులు జరిగితే నాకేం సంబంధం ఉంటుందని అన్నారు. నా బంధువులపైనగానీ, నా కుమారుల ఇంట్లో ఐటీ సోదాలు జరగట్లేదు. నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఇప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా. నాకు పవర్ ప్లాంట్ లు ఉన్నాయన్నది అపోహ మాత్రమే. నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండని భాస్కర్ రావు తెలిపారు.