Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది.

Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

AP Weather Update

Updated On : November 16, 2023 / 8:44 AM IST

AP Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేద్రీకృతమైంది. గడచిన ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది.

తీవ్ర వాయుగుండం రేపు పశ్చిమ బెంగాల్ తీరం, మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే ఆవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాల చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్ల వేగంతో వీచే ఆవకాశం ఉంది.

Cyclone Tej : అరేబియా సముద్రంలో బలపడుతున్న తేజ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD కీలక ప్రకటన

మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.