Omicron Telangana : కొత్తగా 5 కేసులు…22 మంది డిశ్చార్జ్

తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య....

Omicron in Telangana : తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 67కి చేరాయి. ఒమిక్రాన్ నుంచి రికవర్ నలుగురు అయ్యారని, వీరిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని వైద్యులు వెల్లడించారు. మొత్తం 22మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 143 మంది వచ్చారని తెలుస్తోంది. వీరందరికీ కోవిడ్ RTPCR టెస్టులు నిర్వహించారు.

Read More :Delhi Covid Cases : ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. కొత్తగా 1313 కొవిడ్ కేసులు.. 42శాతం అధికం!

మరోవైపు..దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది. గురువారం ఉదయం నాటికి 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడిన 320 మంది కోలుకున్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదైతే…మహారాష్ట్రలో 257, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, కేరళలో 65 కేసులు రికార్డయ్యాయి.

Read More : Chennai Rains : చెన్నైలో భారీవర్షాలు.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జాం

ఇక కరోనా విషయానికి వస్తే…గడిచిన 24 గంటల్లో 13 వేల 154 కేసులు నమోదయ్యాయని తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,48,22,040 కి చేరాయి. 268 మంది కోవిడ్ వైరస్ సోకి చనిపోయారు. అదే విధంగా 24 గంటల్లో 7 వేల 486 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778కి చేరింది.

ట్రెండింగ్ వార్తలు