Delhi Covid Cases : ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. కొత్తగా 1313 కొవిడ్ కేసులు.. 42శాతం అధికం!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఢిల్లీలో కొత్తగా 1313 కోవిడ్ కేసులు నమోదయ్యాయి

Delhi Covid Cases : ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. కొత్తగా 1313 కొవిడ్ కేసులు.. 42శాతం అధికం!

1,313 New Covid Cases In Delhi Today, 42% Higher Than Yesterday

Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల తీవ్రత తగ్గడం లేదు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలో ఎల్లో అలర్ట్
ఆంక్షలను ప్రకటించింది ప్రభుత్వం. గురువారం ఢిల్లీలో కొత్తగా 1313 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కంటే ఈ రోజున 42శాతం అధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7 నెలల తర్వాత దేశ రాజధానిలో అధిక కేసులు నమోదు కావడం ఇదే… మే 26న ఢిల్లీలో 1.93 శాతం పాజిటివ్‌ రేటుతో 1,491 కేసులు నమోదయ్యాయి.

130 మంది కరోనాతో మరణించారు. జాతీయ రాజధానిలో బుధవారం ఒక్కరోజే 923 కరోనావైరస్ కేసులను నమోదయ్యాయి. నిన్నటి నుంచి భారీగా 86 శాతం కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. మే 30 నుంచి అత్యధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1.73 శాతంగా కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ఢిల్లీలో మొత్తంగా 14,46, 415 కరోనా కేసులు నమోదు కాగా.. 25,107 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 3081 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీ వ్యాప్తంగా 645 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం విధించిన కొవిడ్ ఎల్లో అలర్ట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రివేళ్లల్లో నైట్ కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై గరిష్టంగా కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇతర నగరాల్లో భారీగా కేసుల సంఖ్య పెరిగాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్‌లలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి.

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఇటీవలే ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రెండు మూడు రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-I (Yellow Alert)ని అమలు చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేశారు. ఢిల్లీలో ఎల్లో అలెర్ట్‌లో భాగంగా సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు మూసివేశారు.

స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్‌లు, ల్టీప్లెక్స్‌లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు.

మతపరమైన ప్రార్ధనా మందిరాలోకి భక్తుల ప్రవేశంపై కూడా నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ మెట్రో, బస్సులు, రెస్టారెంట్లు, బార్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి పరిమితి విధించింది. ఆటో,క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంది. దుకాణ సముదాయాలు, మాల్స్‌లో దుకాణాలను సరి, భేసి విధానంలో నిర్వహించుకునేలా అనుమతినిచ్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతినిచ్చింది.

Read Also : Covaxin Antibody : కోవాగ్జిన్ టీకాతో పెద్దల్లో కంటే పిల్లల్లోనే అధిక యాంటీబాడీలు.. ఎంతంటే?