Woman
pregnant : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మాన్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవించింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డను గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
తల్లీబిడ్డ యోగక్షేమాలను ఆర్టీసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. గర్భిణి ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వెళ్తోంది. నెలలు నిండడంతో బస్సులోనే ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి.
Birth in Tractor-Trolley: అంబులెన్స్ 2గంటల ఆలస్యం.. ట్రాక్టర్‌లోనే మహిళ ప్రసవం
ఆస్పత్రికి తరలించేలోపే బస్సులోనే ఆమె ప్రసవించింది. సదరు మహిళను మహారాష్ట్రకు చెందిన రత్నమాలగా గుర్తించారు.