Birth in Tractor-Trolley: అంబులెన్స్ 2గంటల ఆలస్యం.. ట్రాక్టర్‌లోనే మహిళ ప్రసవం

అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్ లోనే ప్రసవించే దుస్థితి ఏర్పడింది ఓ మహిళకు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లే క్రమంలో మార్గం మధ్యలోనే డెలివరీ అయింది.

Birth in Tractor-Trolley: అంబులెన్స్ 2గంటల ఆలస్యం.. ట్రాక్టర్‌లోనే మహిళ ప్రసవం

Tractor Trolley

Birth in Tractor-Trolley: అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్ లోనే ప్రసవించే దుస్థితి ఏర్పడింది ఓ మహిళకు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లే క్రమంలో మార్గం మధ్యలోనే డెలివరీ అయింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉన్న అంబులెన్స్ సకాలంలో స్పాట్ కు రాలేదు. దాంతో ట్రాక్టర్ ట్రాలీలో పడుకోబెట్టి హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేయగా ఆమె మార్గం మధ్యలోనే ప్రసవించింది. దేవగాన్ ప్రాంతానికి చెందిన మహిళ అజయ్‌ఘడ్ ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జననీ ఎక్స్‌ప్రెస్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంకాసేపు వేచి ఉండాల్సి వస్తుందంటూ చెప్పారు. పది కిలోమీటర్ల దూరంలో ఉండే హాస్పిటల్ కు వెళ్లడానికి సమయం మించిపోతుంది. వేరే దారిలేక మొండిగా ట్రాక్టర్ లో బయల్దేరారు.

…………………………………………………. : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

‘మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంబులెన్స్ హెల్ప్ లైన్ కు నాలుగు సార్లు ఫోన్ చేశాం. ఒక్క పది నిమిషాల్లో వస్తామని చెప్పారు. రెండు గంటలు అయినప్పటికీ స్పాట్ కు రాలేదు. అజయ్‌ఘడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ట్రాక్టర్ ట్రాలీలో తీసుకెళ్దామని ఫిక్స్ అయి బయల్దేరాం. మార్గం మధ్యలోనే ఆమె ప్రసవించింది. అదృష్టవశాత్తు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు’ అని మహిళ బంధువు అంటున్నారు.

ఘటన గురించి తనకేమీ తెలియదని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పుకొచ్చారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.