Youngster Attack Girlfriend : హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం..ప్రేమించిన యువతిపై 18సార్లు కత్తితో పొడిచి దాడి

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 18 సార్లు కత్తితో పొడిచాడు.

Attcked

youngster attacked girlfriend in Hyderabad : ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని ఇష్టం వచ్చినట్లు దాడులకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీయడానికీ వెనకాడటం లేదు. నిన్న పెద్దపల్లి జిల్లా గోదావిఖనిలో, నేడు హైదరాబాద్ ఎల్బీనగర్‌లో…. అక్కడ అమ్మాయి బలైపోతే… ఇక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 18 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన యువతి పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా యువతి-బస్వరాజు ప్రేమించుకుంటున్నారు.

Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

యువతి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇటీవలే యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. దీంతో యువతి ఇంటికి వెళ్లిన బస్వరాజు.. ఆమెపై దాడి చేశాడు. ప్రస్తుతం నిందితుడు బస్వరాజు పోలీసుల అదుపులో ఉన్నాడు.