Telangana University : తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడులు

ఏసీబీ, విజిలెన్స్ బృందం బుధవారం కూడా తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.

Telangana University : తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడులు

Telangana University

Updated On : June 7, 2023 / 8:17 AM IST

ACB – Vigilance Raid : నిజమాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ నెలకొంది. మంగళవారం 8 గంటల పాటు యూనివర్సిటీలో అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ, విజిలెన్స్ బృందం బుధవారం కూడా తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. యూనివర్సిటీలో రెండేళ్లలో చేసిన ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని ఈసీ ఫిర్యాదు చేసింది.

JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ ఆన్ లైన్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్.. ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు

ఈ యూనివర్సిటీలో తనిఖీలపై ఉత్కంఠ నెలకొంది. తనిఖీల్లో భాగంగా బుధారం వీసీని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంచార్జీ రిజిస్ట్రార్ కనకయ్యను విజిలెన్స్ అధికారులు విచారించారు.