ఒక్కొక్కటిగా వెలుగులోకి ఏసీపీ అరాచకాలు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

లంచం ఇవ్వకుంటే తమపై రివర్స్ కేసులు పెట్టి టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు.

ఒక్కొక్కటిగా వెలుగులోకి ఏసీపీ అరాచకాలు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

ACP Umamaheswar Rao : ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావు అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగార్చిన ఉమామహేశ్వరరావు నిందితులపై చర్యలు తీసుకోవాలంటే 10లక్షల లంచం ఇవ్వాలని వేధించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

లంచం ఇవ్వకుంటే తమపై రివర్స్ కేసులు పెట్టి టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు. ఉమామహేశ్వరరావు తనను బూటు కాలితో తన్ని వేధించాడని ఓ బాధితుడు ఇవాళ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు.

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. జూన్ 5వ తేదీ వరకు ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు.

ఉమామహేశ్వరరావు కుటుంసభ్యులు, బంధువులు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణలో దాదాపు 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఉమామహేశ్వరరావు ఆగడాల గురించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేశారు. 3 కోట్ల 45లక్షల ప్రాపర్టీని సీజ్ చేశారు.

ఆయన అత్తగారి ఇంట్లో 38లక్షల నగదు గుర్తించారు. ఆయన ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ప్రాపర్టీస్ సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 50 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఉమమహేశ్వర రావు ఇంట్లో దొరికిన ట్యాబ్ లో ఆయన లావాదేవీలు, ఎక్కడెక్కడ బిజినెస్ చేశారు? ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేశారు? ఈ డిటైల్స్ మొత్తం తెలిసే అవకాశం ఉందన్నారు. ఇక ఒక డైరీలో ఉమామహేశ్వరరావు కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఆ వ్యక్తులు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరెవరిని బెదిరించారు? ఎంత వసూలు చేశారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.

ఏసీపీ ఉమామహేశ్వరరావు రిమాండ్ రిపోర్ట్..

* ప్రభుత్వం తరుపున ఫిర్యాదు చేసిన ఇన్ స్పెక్టర్ మల్లికార్జున
* FIR no:07/RCA CIU ACB /2024..
* సెక్షన్స్ 13(1)(b) r/w 13(2) పిసి యాక్ట్ 1988
* 3 కోట్ల 51 లక్షల సొత్తు స్వాధీనం
* 8 ప్రాంతాలు, 14చోట్ల సోదాలు
* 17 ప్రాపర్టీస్ గుర్తింపు
* అశోక్ నగర్ 205, 504 ఫ్లాట్స్ లో సోదాలు
* భర్కత్ పురలో DSP సందీప్ రెడ్డి నివాసం.
* కాప్రాలో స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలో సోదాలు
* సికింద్రాబాద్ లో నీలిమ నివాసం
* అనకాపల్లిలో బందువు మహాలక్ష్మి
* విశాఖపట్నంలో బంధువులు వరహాలమ్మ, రామరావు ఇంట్లో తనిఖీలు
* నగదు 38లక్షలు, బంగారం 60 తులాలు స్వాధీనం
* షామీర్ పేట్ లో 80లక్షలు విలువైన ఎకరం భూమి
* షామీర్ పేట్ 333 గజాల విల్లా
* జవహర్ నగర్ లో మూడు గుంటలు
* ఘట్ కేసర్ ఘన్పూర్ నాలుగు ప్లాట్లు
* శామీర్ పేట్ లో 14 గుంటల బీనామీ భూమి
* అశోక్ నగర్ లో అపార్ట్ మెంట్ లో 3 ఫ్లాట్స్
* కూకట్ పల్లిలో 200 గజాల ఫ్లాట్.
* వైజాగ్ లో 25 సెంట్ల భూమి.
* ఏపీ చౌడవరంలో 5.92ఎకరాలు, 240 గజాల ప్లాట్
* దొండపూడిలో 2.20 ఎకరాలు
* బీనామీ ఆస్థులపై దర్యాప్తు కొనసాగుతోంది.
* ఉమా మహేశ్వర రావుతో పాటు మరో డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాల.
* ఆర్ ఎస్ కన్స్ట్రక్షన్ లో విల్లా కొనుగోలు కోసం 50 లక్షలు పెట్టుబడి పెట్టిన ఉమా.
నిందితుడు ఉమామహేశ్వర్ రావు పై దర్యాప్తు కొనసాగుతుంది.

Also Read : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!