Hyderabad Heavy Rain : హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.

Hyderabad Heavy Rain : హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.

Gandipeta Pond : గండిపేట చెరువు 12 గేట్లు ఎత్తివేత..12 ఏళ్ల తర్వాత తొలిసారి

శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగ్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, అంబర్ పేట, ఓయూ, నాచారం, నల్లకుంటా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాన నీరు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

River Musi : హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

ట్రెండింగ్ వార్తలు