River Musi : హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.

River Musi : హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

Musarambag

River Musi : వికారాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది. ఉస్మాన్ సాగర్ 12 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 5వేల 800 క్యూసెక్కులు ఉండగా.. 6వేల 90 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ 6 గేట్ల ద్వారా 3వేల 910 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి మొత్తం పది వేల క్యూసెక్కుల వరద మూసీలోకి వస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది.

మూసారంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జితో పాటు మూసారం బాగ్ బ్రిడ్జిని మూసివేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

వందేళ్ల తర్వాత : విశ్వ రూపం చూపిస్తున్న మూసీ నది

చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జి పురాతనమైనది కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. మంగళవారం రాత్రికి బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. మంగళవారం రాత్రికి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. వరద నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

భారీ వర్షాలు : మూసీనది వరదలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు