BRS MLA Gongidi sunitha
TS High court..MLA Gongidi Sunitha : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత(BRS MLA Gongidi Sunitha )కు హైకోర్టు (high court)జరిమానా విధించింది. ఆలేరు ఎమ్మెల్యే సునీత ఎన్నిక చెల్లదు అంటూ సైని సతీష్ వేసిన పిటీషన్ పై విచారించిన ధర్మాసనం ఆమెకు రూ.10వేలు జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో గొంగిడి సునీత అఫిడవిట్ లో ఆస్తులు చూపించకుండా తప్పుడు సమాచారాన్ని చూపించారు అంటూ సైని సతీష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సునీత కౌంటర్ పిటీషన్ దాఖలు చేయలేదు. దీంతో హైకోర్టు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఆమెకు రూ.10వేలు జరిమానా విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.
2018 ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అఫిడవిట్ లో తన ఆస్తుల వియాన్ని పూర్తిగా చూపించలేదని.. తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ ఆమెపై పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. 2018నాటి ఈ కేసులో సునీత ఇప్పటివరకు కౌంటర్ పిటిషన్ వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తు రూ. 10వేల జరిమానా విధించింది. అంతేకాదు అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.