Secunderabad Gandhi Hospital : ఆగస్టు 3 నుంచి గాంధీలో సాధారణ వైద్య సేవలు

Gandhi Hospital
Secunderabad Gandhi Hospital : గత రెండేళ్లుగా అత్యవసర సమయంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3 నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కోవిడ్ రెండో దశలో గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా రోగులకు సేవలు అందించటానికి పరిమితం చేశారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొంటున్న దృష్ట్యా… కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అన్నిరకాల సాధారణ వైద్య సేవలను ఆగస్ట్ 3నుంచి పునురుధ్ధరిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.