CEC : నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశం

గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

Central Election Commission

CEC – Private Organizations Holiday : తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

తెలంగాణలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎక్కడ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదు. నవంబర్ 30వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది.

Also Read: దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

సాయంత్రం 5 గంటల తరువాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. సాయంత్రం 5 గంటల తరువాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు