Sonia Gandhi : దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు.

Sonia Gandhi : దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

Sonia Gandhi

Updated On : November 28, 2023 / 3:58 PM IST

Sonia Gandhi Message People : కాంగ్రెస్ జాతీయ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా కానీ, మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు’ అని అన్నారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నానని తెలిపారు.

దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు. తనను సోనియమ్మ అని పిలిచి తనకు చాలా గౌరవం ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయాలని తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు.

Also Read: దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ : ప్రియాంక గాంధీ

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వీడియో సందేశం పంపారు. మరోవైపు సోనియా కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ తెలంగాణలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.