Amit Shah Hyderabad Tour : ఈడీ విచారణ వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తుండటం, అదే రోజు కవిత ఈడీ విచారణ ఉండటం ఆసక్తి రేపుతోంది. ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా రాబోతున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నాయకులకు షా దిశానిర్దేశం చేయనున్నారు. కవిత ఈడీ విచారణ సమయంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
11న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. అదే రోజున అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఉండటం, బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానుండటం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. అమిత్ షా హైదరాబాద్ టూర్ తో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు.(Amit Shah Hyderabad Tour)
ఇప్పటికే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయకులు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. అయితే, మునుపెన్నడూ లేని విధంగా అమిత్ షా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అదే రోజున సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈడీ విచారించనుంది. ఇక అదే రోజు అమిత్ షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్చి 11 హాట్ టాపిక్ గా మారింది. ఆ రోజు ఏం జరగనుంది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అమిత్ షా పర్యటనకు సంబంధించి తెలంగాణ బీజేపీ నాయకులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక, ఒకేరోజు ఇటు ఢిల్లీలో కవిత విచారణ, తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉండనుండడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈడీ ప్రశ్నలకు కవిత ఎలాంటి సమాధానాలు చెబుతారు. ఆమె సమాధానాలను బట్టి ఈడీ ఎలా ముందుకెళ్తుంది అనే అంశంపై తీవ్ర సస్పెన్స్ నెలకొంది. ఇక రాష్ట్ర బీజేపీ నాయకులకు అమిత్ షా ఎలాంటి సందేశం, సూచనలు ఇవ్వనున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.(Amit Shah Hyderabad Tour)
కాగా, అమిత్ షా హైదరాబాద్ టూర్ అధికారిక ప్రకటన. 15 రోజుల క్రితమే పర్యటన ఖరారైంది. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాయి. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ కదలికలపైనా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. మొత్తంగా మార్చి 11న ఏం జరగనుంది? అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.(Amit Shah Hyderabad Tour)