Amit Shah : తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.. తెలుగులో అమిత్ షా ట్వీట్

హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు..

Amit Shah : హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బీజేపీ కట్టుబడి ఉందని షా హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా అభినందనలు తెలిపారు.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ 24వేల 068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల గెలుపుతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈటల విజయాన్ని పురస్కరించుకుని మిఠాయిలు పంచుకున్నారు.

అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి ఈటల ఘనవిజయం సాధించారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కొనియాడారు. బీజేపీని గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు, ఈ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి.. ఈటల ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగింది. రెండు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ ఈటల ఆధిక్యం స్పష్టమైంది.

కాగా, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఈటలకు ఇది వరుసగా ఏడో విజయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల… భూ అక్రమాల ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయారు. ఆపై టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో ఈటల సెంటిమెంట్ ముందు టీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు పని చేయలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయన తన స్వగ్రామంలోనూ, అత్తగారి ఊర్లోనూ ఆధిక్యం పొందలేకపోయారు. సొంతూరు హిమ్మత్ నగర్ లో గెల్లుకు 358 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఈటల రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి. అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గెల్లు కంటే ఈటలకు 76 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు