TSPSC Paper Leak Case: గ్రూప్-1 పేపర్ లీక్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్.. వెలుగులోకి ప్రవీణ్, రాజశేఖర్‌ల మరో కోణం

షమీమ్, రమేష్‌ల నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కి పేపర్ లీకయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణం‌లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak Case) దర్యాప్తు జరుగుతున్నా కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1 ప్రశ్నపత్రం (Group-1 Question Paper) లీకేజీ వ్యవహారం పెనుదుమారం లేపుతోంది. ప్రశ్నపత్రం లీకేజీలో కీలక వ్యక్తులుగా ఉన్న ప్రవీణ్ (Praveen), రాజశేఖర్‌ (Rajasekhar)లు తప్పులమీద తప్పులు చేసినట్లు సిట్ దర్యాప్తు (SIT investigation) లో తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్-1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు గుర్తించారు. అయితే, వీరు ప్రశ్నాపత్రం లీకేజీ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్తారేమో అనే భయంతో షమీమ్, రమేష్‌లను ప్రలోభ పెట్టారు. మీకుకూడా గ్రూప్-1 పేపర్ ఇస్తామని, మీరు కూడా ఎగ్జామ్ రాసి జాబ్ సాధించొచ్చు అని ప్రవీణ్ అనే వ్యక్తి షమీమ్, రమేష్ లకు ఆశ చూపినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

షమీమ్, రమేష్‌ల నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కి పేపర్ లీకయినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణం‌లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. షమీమ్, రమేష్, సురేష్‌లను ఐదు రోజుల కస్టడీ‌కి కోర్టు అనుమతిచ్చిన విషయం విధితమే. దీంతో నేటి నుంచి షమీం, రమేష్, సురేష్ లను సిట్ అధికారులు విచారించనున్నారు. సిట్ అధికారుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసింది. రెండింటిని వాయిదా వేసింది. తాజాగా హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షనుకూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 4న ఈ పరీక్షజరగాల్సి ఉంది. అయితే, జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో మరో ఎనిమిది రకాల పోస్టులకు టీఎస్పీఎస్సీ నియామక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీటినిసైతం రీ షెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు