AP Results 2026 : ఏపీలోని ఇంటర్, 10th విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు వెల్లడి తేదీలు ఇవే..
AP Results 2026 : ఏపీలోని ఇంటర్, టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్. ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : April 5, 2026 / 02:42 PM IST
AP Results 2026
- ఏపీలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులు బిగ్ అప్డేట్
- ఏప్రిల్ 15న ఇంటర్ ఫలితాలు
- ఏప్రిల్ 25న టెన్త్ ఫలితాలు వెల్లడించే చాన్స్
AP Results 2026 : ఏపీలోని ఇంటర్, టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్. ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫలితాలను వెల్లడించనుంది.. ఆ తరువాత పది రోజుల వ్యవధిలోనే విద్యాశాఖ టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Also Read : Gold Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే?
ఇంటర్మీడియట్ ఫలితాల ప్రక్రియలో భాగంగా పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీలు, ఫలితాల క్రోడీకరణ పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. అనుకున్న ప్రకారం ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలచేసిన పదిరోజులకు టెన్త్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తి చేస్తారు. ఏప్రిల్ 16 నుంచి 24వ తేదీ వరకు డేటా ప్రాసెసింగ్, ట్యాబ్యులేషన్ వంటి ప్రక్రియలు చేపడతారు. ఈనెల 25వ తేదీన లేదంటే ఆ తరువాత ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.
