Eatala Rajendar : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్.. అలాంటి పరిస్థితి రాదు.. సందర్భం వస్తే నేను ఏంటో తెలుస్తుంది..
Eatala Rajendar : కరీంనగర్లో పోస్టర్లు వేస్తున్నారు. వాటిని మాపార్టీ వారు కూడా షేర్ చేస్తున్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు.. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీ మారడం సాధ్యం కాదని నేనే చెప్పిన అని ఈటల రాజేందర్ అన్నారు.
Eatala Rajendar
Eatala Rajendar : మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ స్పందించారు. పార్టీ మారుతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
Also Read : Gold Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే?
కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటకు గెంటేసి ఐదేళ్లు అవుతుంది. ఆరోజు మేము ఏం మాట్లాడిన బయటకు వెళ్లలేని పరిస్థితి.. అలాంటి పరిస్థితుల్లో నేను బీజేపీలో చేరాను. ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ లో పోస్టర్లు వేస్తున్నారు. వాటిని మా పార్టీ వారు కూడా షేర్ చేస్తున్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు.. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీ మారడం సాధ్యం కాదని నేనే చెప్పిన. కేసీఆర్ ఈటెల రాజేందర్ ను పోగొట్టుకొని తప్పు చేశారని చర్చ జరుగుతోంది. మళ్లీ తిరిగి వస్తారని చర్చ నడుస్తోంది. అలాంటి పరిస్థితి రాదని నేను చెబుతున్నా అంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఆరోజు నేను ఎంత బాదపడ్డానో నాకు తెలుసు.. ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ చేయని పనిలేదు. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. సందర్భం వస్తే ఈటల రాజేందర్ అంటే ఏమిటో తెలుస్తుంది అంటూ ఈటల వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మీడియాను చెరబట్టి కేసీఆర్‌లాగే బయటకు రాకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తరహాలో ఫీజు రీయింబర్స్ మెంట్‌ను చెల్లించం అనే ధోరణిలో రేవంత్ సర్కార్ ఉంది. కేసీఆర్‌కు పట్టినగతే రేవంత్ రెడ్డికి పడుతుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
జీహెచ్ఎంసీలో ముగ్గురం ఎంపీలు ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మినహా ఆరుగురు ఎంపీలు ఉన్నాం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ముందుగా మా ఎంపీల బృందం ప్రజా సమస్యలపై ఛలో బాలాజీ నగర్ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. వైరుద్యాలు, కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. ఒక చిన్న బాధ మాత్రం ఉంది. ఇతర పార్టీల నుంచి పదవుల కోసం అధికారం పార్టీలోకి వస్తారు అని పోస్టులు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఏ మంత్రి కావాలి టిక్ పెట్టుకో అని ఆఫర్ చేస్తే వెళ్లలేదు. నా సహచరులు రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి లాంటివారు కేసీఆర్ ను ఓడించేందుకు ఓకే ప్లాట్ ఫాం మీదకు రావాలని అడిగితే నేను వెళ్లలేదు. కొంతమంది పదవుల కోసం మారుతారు.. అధికారం కోసం పార్టీలు మారుతారు.. నేను అలాంటి వ్యక్తిని కాదు.. మీడియాలో ఉండే వాడిని కాదు.. సోషల్ మీడియాలో ఉండే వ్యక్తిని కాదు.. కొంతమంది వీటినే నమ్ముకుని పనిచేస్తున్నారు అంటూ ఈటల వ్యాఖ్యానించారు.
