Gold Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే?
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్దిరోజుల క్రితం వరకు భారీగా పెరిగిన గోల్డ్ రేటు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి శుభవార్త. రెండు రోజులుగా వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిలకడగా కొనసాగుతున్నాయి.

ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. ఔన్సు గోల్డ్‌పై 107 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,677 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

శుక్ర, శనివారాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. ఆదివారం సైతం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,080కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,52,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,500 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
