AP Telangana Flash Flood Alert : ఏపీ, తెలంగాణకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ 13జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు..

AP Telangana Flash Flood Alert : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ఇవాళ సాయంత్రంలోగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Telangana Flash Flood Alert

AP Telangana Flash Flood Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ఇవాళ సాయంత్రంలోగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read : Telangana Weather : తెలంగాణలో వర్షాల బీభత్సం.. 17జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గడిచిన 6గంటల్లో గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 180 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ రాత్రికి తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. అలాగే గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాలకు కూడా ఫ్లడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ కాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు.. ఒడిశాలోని ఐదు జిల్లాలు, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ప్లాష్ ప్లడ్ అలర్ట్ జారీ చేసింది.

నేడు , రేపు భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లకపోవడం, వరద నీటిని దాటేందుకు ప్రయత్నించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.