హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీలో గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనను కూడా లాయర్లు ప్రస్తావించడం గమనార్హం.
వాదనలు ఇలా జరిగాయి..
గతంలో ఏపీలో జరిగిన పుష్కరాల కేసును అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. పుష్కరాల సమయంలో అప్పుడు సీఎం చంద్రబాబు అక్కడే ఉన్నారని తెలిపారు. తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని, ఆ సందర్భంగా అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని అన్నారు.
ఇప్పుడు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో నో ప్రాపర్ ఫెసిలిటీస్ అని రాశాడని అల్లు అర్జున్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు రాశారని చెప్పారు. కానీ, డిసెంబర్ 2న పోలీస్ బందోబస్తు కోసం పోలీసులకు లేఖ రాశామని అన్నారు.
ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి బందోబస్తు కావాలని రిలీజ్ కు రెండు రోజులు ముందు కోరామని తెలిపారు. దీంతో, మీరు ఇచ్చిన లేఖను పోలీసులు acknowledge చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు అల్లు అర్జున్ అడ్వకేట్ సబ్మిట్ చేశారు.
పోలీసులు నిర్లక్ష్యం అనే పదాన్ని పదే పదే రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారని అల్లు అర్జున్ అడ్వకేట్ తెలిపారు. మీరు అనుమతి తీసుకున్నాక, సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎక్కడుంది అని హైకోర్టు అడిగింది. అల్లు అర్జున్ పై ఉన్న ఆరోపణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. థియేటర్‌కు వెళ్లడానికి ఆయన సినిమా నటుడు, అనుమతి తీసుకునాడు కదా అని హైకోర్టు అడిగింది.
అనుమతి తీసుకున్నప్పటికీ, హీరో, హీరోయిన్లను థియేటర్ కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారని అడ్వకేట్ చెప్పారు. మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా అని హైకోర్టు ప్రశ్నించింది. కాపీ ఏమైనా ఉందా అని హైకోర్టు అడిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ ను రిమాండ్ చేశారు కాబట్టి క్వాష్ పై సోమవారం వాదనలు వినండని ప్రభుత్వ న్యాయవాది అన్నారు.
ఒకవేళ కింది కోర్టు అల్లు అర్జున్ ను రిమాండ్ చేసినా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ విధంగా పలు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను రిమాండ్ చేశారు కాబట్టి క్వాష్ పై సోమవారం వాదనలు వినండని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. ఒకవేళ కింది కోర్టు అల్లు అర్జున్ ను రిమాండ్ చేసినా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని నిరంజన్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ కూడా ఇచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
అల్లు అర్జున్ ను రిలీజ్ చేస్తే మీకు ఉన్న అభ్యంతరం ఏమిటని హై కోర్టు అడిగింది. ఆల్రెడీ రిమాండ్ అయ్యాకా, ముందస్తు బెయిల్, క్వాష్ వర్తించవని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కానీ IA పిటిషన్ రూపంలో బెయిల్ ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు కదా అని హైకోర్టు అడిగింది. అసలు రిమాండ్ రిపోర్ట్ లేకుండా బెయిల్ పిటిషన్ ఎలా మూవ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. IA పిటిషన్ లో బెయిల్ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి కదా అని హైకోర్టు అడిగింది. చివరకు అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.