Allu Arjun : అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్..

సినీ న‌టుడు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంప‌ల్లి కోర్టు.

Allu Arjun : అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్..

Updated On : December 13, 2024 / 5:09 PM IST

సినీ న‌టుడు అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు త‌ర‌లించ‌నున్నారు.

డిసెంబ‌ర్ 4న ‘పుష్ప2’ ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ కు అల్లు అర్జున్ రావ‌డంతో అక్క‌డ ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మృతిరాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Allu Arjun : అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న‌ చిరంజీవి, నాగ‌బాబు..

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డి నుంచి చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆయ‌న వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకున్నారు. ఆ త‌రువాత గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు చేయించారు.

అనంత‌రం నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచగా.. వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Daaku Maharaaj : బాల‌కృష్ణ ‘డాకు మ‌హారాజ్’ ఫ‌స్ట్ సింగిల్ ప్రొమో.. ‘డేగ డేగ డేగ..’